కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.  చిన్న వయసులోనే ఇలా గుండెపోటు వచ్చిన కన్నుమూయడంతో కన్నడ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.  జూన్ 6న చిరంజీవి సర్జాకు శ్వాసకోస సమస్య రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన వయసు తక్కువే కావడంతో ఇది హృదయ సంబంధ వ్యాధి అని ఎవరూ అనుకోలేదు. కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన చిరంజీవికి తీవ్రమైన ఛాతీ నొప్పి కూడా వచ్చినట్టు తెలిసింది. దాంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.  ఆయన ఆకే, సింగా, సంహారా వంటి విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించారు. చిరంజీవికి నటి మేఘనా రాజ్‌తో 2018లో వివాహం జరిగింది. ఇక ఆయన సోదరుడు ధ్రువ సర్జా కూడా సినిమా ఇండస్ట్రీలోనే నటుడిగా ఉన్నారు. 

ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న ఫాంహౌజ్‌లో కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కన్నడ సినీస్టార్లు కిచ్చా సుదీప్‌, యశ్‌, కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడు డీకే శివకుమార్‌ తదితరులు చిరంజీవి సర్జా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తానెంతో ప్రేమగా చూసుకునే మేనల్లుడు చిరంజీవి సర్జా మరణాన్ని తట్టుకోలేకపోయిన నటుడు అర్జున్..  వెక్కి వెక్కి ఏడ్చారు. మేనల్లుడి మరణం తరువాత, ఆదివారం రాత్రి కారులో బెంగళూరుకు చేరుకున్న ఆయన, నిన్న జరిగిన సర్జా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

IHG

"నేను... నీ మామను వచ్చాను... లేవరా..." అంటూ అర్జున్ బోరున విలపించడాన్ని చూసి పలువురు బంధుమిత్రులు కన్నీరు పెట్టుకున్నారు.  కాగా, చిరంజీవి సర్జా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తారని భావించిన స్థానిక పోలీసులు, బసవనగుడి ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినా, అక్కడికి వచ్చే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఒక్కలిగ సంప్రదాయంలో నిన్న సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: