సినిమా వాళ్ళకు వివాహాలు అయితే వాళ్ళు కలిసి ఉండటం మీద ముందు నుంచి కూడా అనేక అనుమానాలు ఉంటాయి. అంద‌రిని ఈ గాటానా క‌ట్ట‌లేం కాని.. గ్లామ‌ర్ ఫీల్డ్ అయిన సినిమా రంగంలో ఎవ‌రు ఎవ‌రితో ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ‌తారో ?  ఎవ‌రు ఎవ‌రిని ఎప్పుడు వ‌దిలేస్తారో ?  మ‌ళ్లీ వాళ్లు ఏ కొత్త వారితో ప్రేమ‌లో ప‌డ‌తారో తెలియ‌దు. ఇక ఈ జంట‌లు పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ఎప్ప‌టి వ‌ర‌కు కలిసి కాపురం చేస్తార‌న్న‌ది సందేహ‌మే. అంతెందుకు సినిమా హీరోలు.. హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని పిల్ల‌ల‌ను క‌ని .. వాళ్లు పెళ్లీడు కొచ్చాక కూడా విడిపోయిన సంద‌ర్భాలు అనేకం. 

 

సినిమా రంగంలో ముందు నుంచి కూడా దాదాపుగా ఇదే జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మధ్య ఏదోక విభేదం రావడం అది పెద్దల మధ్యకు రావడం పెద్దలు దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం... అది ఏ విధంగా కూడా ముందుకు వెళ్లకపోవడం చివరికి వాళ్ళు విడిపోవడం చాలా కామ‌న్‌. 
ఇప్పుడు టాలీవుడ్ లో దాదాపుగా ఇలాంటిదే ఒకటి జరుగుతుంది అని సమాచారం. టాలీవుడ్ లో ఒక యువ హీరో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఎప్పటి నుంచో వీళ్ళు ఇద్దరు కలిసి లేరు అనే ప్రచారం జరుగుతుంది. 

 

ఒకే ఇంట్లో ఉన్నా సరే ఎవరికి వారుగా ఉంటున్నారు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. దీనిపై మీడియాలో కూడా పలు కథనాలు వచ్చినా సరే ఖండించారు కొందరు. ఇప్పుడు టాలీవుడ్ లో వీరు విడాకుల వరకు వెళ్ళారు అనే ప్రచారం జోరుగా జ‌రుగుతోంది. విడాకులు తీసుకోవడానికి ఇద్దరూ కూడా సిద్దంగా ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. దీనికి సంబంధించి రాజీ చేయడానికి వచ్చిన వారిని కూడా పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదు అని సమాచారం. ఆ హీరో ఒక పెద్ద‌ సినిమా చేస్తున్నాడు... ఈ సినిమా తర్వాత వైవాహిక జీవితంపై ఏ నిర్ణ‌యం అయినా తీసుకుంటాడ‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: