టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లుగా కొనసాగిన యంగ్ హీరోలు  ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అందులో భాగంగా ఇటీవల నిఖిల్ తన ప్రేయసి పల్లవి వర్మ ను వివాహం చేసుకున్నాడు. మరో యంగ్ హీరో నితిన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. నితిన్ కూడా తన ప్రేయసినే పెళ్లి చేసుకోనున్నాడు. ఇక తాజాగా రానా  కూడా  ఈ జాబితాలో చేరిపోయాడు. గత కొన్నేళ్లుగా మిహిక బజాజ్ ను ప్రేమిస్తున్న రానా ఇటీవల పెళ్ళికి ఒప్పించాడు. కొద్దీ రోజుల క్రితం వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక వీరి పెళ్లి ఆగస్టు 8న జరుగనుందని  వార్తలు వచ్చాయి. తాజాగా రానా తండ్రి సురేష్ బాబు కూడా ఆవార్తలను ధ్రువీకరించాడు. ఆగస్టు 8న రానా వివాహం జరుగనుందని సురేష్ బాబు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.
 
ఇదిలావుంటే రానా ప్రస్తుతం విరాటపర్వం లో నటిస్తున్నాడు. వేణు ఊడుగుల డైరెక్షన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా  సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. వీరితో పాటు మలయాళ నటి నందితా దాస్ సీనియర్ హీరోయిన్  ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోంది. సురేష్ బాబు ,చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదలకానుంది.
 
ఈసినిమా కన్నా ముందు రానా , అరణ్య తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. ఏప్రిల్ లోనే విడుదలకావల్సిన ఈ చిత్రం కరోనా వల్ల వాయిదాపడింది. థియేటర్లు తెరుచుకోగానే ఈ సినిమాను విడుదలచేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: