ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలు హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించే వారికి కూడా అంతే క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒక సినిమా కోసం హీరో హీరోయిన్లను వెతికి పెట్టడం కంటే వారికి సరిపడ తల్లి పాత్రల్లో  నటించే నటీనటులను వెతికి  పెట్టడమే దర్శక నిర్మాతలకు పెద్ద సవాల్ అని చెప్పాలి. ఎందుకంటే సదరు హీరో హీరోయిన్లకు సరిపడా తల్లి పాత్రలో నటించిన వారు సెట్ అవ్వలేదు  అనుకోండి ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. ఒక సినిమా కోసం హీరో వెతకడం లో తీసుకున్న జాగ్రత్తలతో పాటు... వారికి తల్లి పాత్రల కోసం నటీమణులను వెతకడంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు దర్శక నిర్మాతలు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన వాళ్ళందరూ ప్రస్తుతం అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన విషయం తెలుస్తుంది. స్టార్ హీరోయిన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించి ప్రస్తుతం అమ్మ  పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన వాళ్లలో  ముందు వరుసలో ఉంటారు జయసుధ. 

 


 అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించారు జయసుధ. అభినయం నటనతో విమర్శకులను సైతం అందుకున్నారు . జయసుధకు సహజనటి అని అంటూ ఉంటారు ఏ పాత్రలోనైనా జీవించి మరి నటిస్తూ ఉంటుంది జయసుధ. ఆ తర్వాత కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మగా అవతారమెత్తింది జయసుధ. ఎంతో మంది హీరోలకు హీరోయిన్లకు అమ్మ పాత్రల్లో నటించి ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది.. రవితేజ హీరోయిన్ గా అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో  రవితేజకు అమ్మ పాత్రలో నటించిన జయసుధ ఎంతగానో మెప్పించింది అనే చెప్పాలి. ఆ తర్వాత పరుగు సినిమాలో అల్లు అర్జున్ కి అమ్మగా, మహర్షి సినిమాలో మహేష్ బాబు కు తల్లిగా, గోవిందుడు అందరివాడే సినిమా లో రామ్ చరణ్ కు నానమ్మ గా, బొమ్మరిల్లు సినిమాలో  సిద్ధార్థ అమ్మగా, ఎవడు సినిమాలో చరణ్  అమ్మగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది జయసుధ

 

 కేవలం పాత్రలో నటించడమే కాదు తెలుగుతనం ఉట్టిపడేలా ఎప్పుడు ట్రెడిషినల్ లుక్ తో...  నిజంగా ఒక అమ్మ అత్త నానమ్మ ఎలా ఉంటారో అలాగే తన పాత్రలో  అభిప్రాయాన్ని ప్రదర్శిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది జయసుధ. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంలో జయసుధకు ఎవరు సాటి లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: