తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన వాళ్ళు... స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన వారు ప్రస్తుతం అదే స్టార్ హీరోలకు అమ్మ అత్త పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.హీరోయిన్  కెరియర్ కి చాలా తక్కువ సమయం ఉంటుంది. కేవలం ఒక దశాబ్ద కాలం పాటు మాత్రమే హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో రాణించగలరు అన్నది ఒక టాక్. దశాబ్ద కాలం తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో పాత హీరోయిన్లకు క్రేజ్ తగ్గిపోయి అవకాశాలు తగ్గిపోయి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పోతూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఎంతో మంది హీరోల సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ గా నటించిన వారు నేడు  అమ్మ అత్త పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ప్రస్తుతం ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న నాటి తరం హీరోయిన్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. 

 


 ఇలా ఒకప్పుడు హీరోయిన్గా ఒక రేంజ్ లో పాపులర్ అయ్యి  తర్వాత హీరోయిన్లకు అమ్మ పాత్రలో నటించిన నాటి తరం హీరోయిన్ రోజా. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ రోజా కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు హీరోలతో నటిస్తూ తనదైన అందం అభినయంతో మెప్పిస్తూ నే మరోవైపు వైవిధ్యమైన పాత్రలతో  ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యి  ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సమ్మక్క సారక్క లాంటి చారిత్రాత్మక సినిమాల్లో కూడా నటించి ఎవరికీ సాధ్యం కాని గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్గా తన డాన్స్ పర్ఫార్మెన్స్ లు నటన అందం తో మెప్పించిన రోజా ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా  మారిపోయింది. 

 


 ఎన్నో సినిమాలు హీరోయిన్లకు అమ్మ పాత్రలో నటించింది రోజా. శంభో శివ శంభో సినిమా లో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఓ యువతికి అమ్మ పాత్రలో నటించి ఎంతో మందిని మెప్పించింది రోజా. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా తెరకెక్కిన మొగుడు సినిమాలో తాప్సి అమ్మ పాత్రలో నటించి మరోసారి తన అందం అభినయంతో మెప్పించింది రోజా. హీరోల సినిమాల్లో హీరోయిన్ లకు అమ్మ పాత్రలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించింది. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమైపోయింది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నప్పటికీ వెండితెరపై మాత్రం రోజా ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: