తెలుగు సినిమాల్లో హాస్యానికి పెద్ద పీట వేస్తారు. సినిమాల్లో కామెడీనే కాకుండా సునిశిత కామెడీతో వచ్చిన సినిమాలెన్నో ఉన్నాయి కూడా. జంధ్యాల, రేలంగి, ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ సత్యనారాయణ.. ఇలా ఎంతోమంది తెలుగు సినిమాలో హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. హాస్యరస సినిమాలే కాకుండా సీరియస్ కథల్లో కూడా మంచి కామెడీని జొప్పించేవారు. ప్రస్తుతం తనదైన స్టైల్లో సినిమాలు తెరకెక్కిస్తున్న మోహనకృష్ణ ఇంద్రగంటి కూడా ఇదే పంథాలో వెళ్తున్నారు. ఆయన చేసిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అమీ తుమీ’. ఈ సినిమా విడుదలై నేటికి 3 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

అడివి శేష్, శ్రీనివాస్ అవసరాల హీరోలుగా నటించిన ఈ సినిమా 2017 జూన్ 9న విడుదలైంది. సినిమా అంతా తనచుట్టూనే తిరిగే ‘శ్రీ చిలిపి’ అనే కీలక పాత్రలో స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ నటించాడు. పేరు, కామెడీ, టైమింగ్.. ఇలా ప్రతి చోటా తన మార్క్ చూపించి ఆకట్టుకున్నాడు. సినిమాలో పనిమనిషి ‘కుమారి’ పాత్ర కూడా కీలకమే. శ్యామల కుమారి పోషించిన ఈ పాత్ర సునీల్ కలిసి ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తారు. హీరో హీరోయిన్ కాంబినేషన్లు కూడా సినిమాలో చూడముచ్చటగా ఉన్నాయి. సినిమాకు దర్శకుడు మోహనకృష్ణ రాసుకున్న స్క్రీన్ ప్లే ప్లస్ పాయింట్.

IHG

 

హీరోయిన్లుగా ఈషా రెబ్బా, అదితి మ్యాకల్ నటించారు. ఈషా పలికిన తెలంగాణ యాస, చిలిపి నటన ఆకట్టుకుంటాయి. తనికెళ్ల భరణి తనదైన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. సినిమాకు తన స్థాయి సంగీతం అందించిన మణిశర్మ వీనులవిందుగా ఉంటుంది. ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కెసీ నరసింహారావు ఈ సినిమా తెరకెక్కించారు. ఎటువంటి సస్పెన్స్ లేకుండా చాలాకాలం తర్వాత ప్రేక్షకులు ఆస్వాదించిన మంచి కామెడీ మూవీగా ‘అమీతుమీ’ నిలిచిపోయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: