లాక్ డౌన్ టైం లో చాలామంది కొత్త సినిమాలను చూసే సినిమా ప్రేమికులు OTT కి అలవాటు పడటం జరిగింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కారణంతో సినిమా థియేటర్లు క్లోజ్ అవ్వటంతో ఏ రోజుకి ఆ రోజు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లంతా ఓటీటీ ఫ్లాట్ ఫాం వైపుకు మళ్లారు. ఒకానొక సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫాం కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం అయి ఉండేది. కరోనా ఎఫెక్ట్ తో సినిమా థియేటర్లు క్లోజ్ అవ్వటంతో ఓటీటీ కి గ్రామీణ ప్రజలు కూడా అలవాటు పడ్డారు. ఇదిలా ఉండగా ఒకానొక టైంలో సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ప్రేక్షక ఆదరణ దక్కించుకొని కొన్ని సినిమాలు ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫాం లో దుమ్ము దులుపుతున్నయి.

IHG's Transformation as <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HOCKEY' target='_blank' title='hockey-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hockey</a> Player ...

ఆ విధంగా 2 సంవత్సరాల క్రితం బాలీవుడ్ మూవీ ‘సూర్మా’ ఒకటి రిలీజ్ అయి ప్రేక్షకాదరణ దక్కించుకోలేదు. కానీ ప్రస్తుతం ఓటీటీ లో చాలా మంది ఈ సినిమా చూసి ఇష్టపడుతున్నారు. ఇలాంటి సినిమా కి ఎందుకు ఆదరణ దక్కలేదని అంటున్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ బయోపిక్ సినిమా ఇది. దేశ హాకీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన సందీప్ సింగ్ జీవిత కోణంలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మొదటిగా హాకీ క్రీడాకారుడు అవ్వకముందు అమ్మాయి ప్రేమలో పడి, హాకీ క్రీడాకారుడు కావటం ఆ తర్వాత ఒక యాక్సిడెంట్ లో వెన్నుపూస దగ్గర ప్రమాదం అవ్వటంతో వీల్ ఛైర్ కే పరిమితమవుతాడు.

IHG's film is more a drag than a ...

అలాంటిది పట్టుదలతో నడవటమే కాదు.. మరోసారి అతనికి భారతజట్టు తరఫున ఆడే ఛాన్స్ వస్తోంది. జీవితంలో నడిచే అవకాశమే లేదన్న వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా నడవటమే కాదు.. భారత హాకీ జట్టునడిచేలా చేయటానికి మించిన రియల్ డ్రామా ఇంకేం ఉంటుంది. 2008లో జరిగిన అజ్లాన్ షా కప్ లో తొమ్మిది గోల్స్ చేసి టాపర్ గా నిలవటమే కాదు.. భారత హాకీ జట్టుకు కెప్టెన్ గా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించాడు. ఆ తరువాత 2012వ సంవత్సరంలో లండన్ ఒలింపిక్స్ కి అర్హత సాధించడంలో కీలక భూమిక పోషిస్తారు. అనేక కారణాలతో జీవితం ఇంకా అయిపోయింది అనుకున్న వ్యక్తి ఏ విధంగా విజయాలు సాధిస్తాడు డైరెక్టర్ అద్భుతంగా చిత్రీకరించడంలో సక్సెస్ అయ్యారు. కెరియర్లో 100 గోల్స్ సాధించిన సందీప్ సింగ్ బయోపిక్ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫాంలో బాగా ప్రేక్షకాదరణ దక్కించుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: