తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్  లవబుల్  కపుల్  ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు నాగచైతన్య సమంత. వీరిద్దరి జంట టాలీవుడ్లో ఎంతో మందికి ఫేవరెట్గా ఉంటుంది. అంతే కాదు నటన విషయంలో ఇద్దరూ ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత కూడా సమంతను నటనకు దూరం కాకుండా అంగీకరించిన భర్త నాగచైతన్య ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇక వీరిద్దరూ ఎక్కడ కనిపించినా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు. ఇకపోతే ఈ జంట సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేయడంతో పాటు వ్యక్తిగత అప్డేట్స్ ని  కూడా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు. 

 


 ఇక తాజాగా ఈ జంట కు సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అక్కినేని సమంత తన భర్త నాగచైతన్య కోసం ప్రత్యేకంగా ఎంతో కష్టపడి వంట చేయడంలో శిక్షణ పొందుతున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లు  మొత్తం ఆగిపోయి ఇంటిపట్టునే ఉంటున్నా తరుణంలో తన భర్త నాగచైతన్య కోసం సమంత ఏకంగా వంట చేసి పెట్టాలని కోరికతో  ఉందట.. దీంతో ఫేమస్ అయిన చెఫ్  ఆధ్వర్యంలో వంట ఎలా చేయాలి అనే దానిపై శిక్షణ తీసుకుంటుందట సమంత. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే నటనపై ఎంతో ఏకాగ్రతతో ఉంటుందో వంట పై  కూడా అంతే ఏకాగ్రతను చూపిస్తుంది సమంత... 

 


 ఈ లాక్ డౌన్  సమయం పూర్తయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లో వంట నేర్చుకొని తన భర్త నాగచైతన్యకు తానే స్వయంగా వండి పెట్టాలని కోరికతో ఉందట సమంత  అదే సమయంలో ఫ్యూచర్ ప్లాన్స్ పై కూడా ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారం చేయాలి అనే దానిపై సరికొత్త స్టెప్స్ వేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటుందట ఈ జంట . ఇప్పటికే నాగచైతన్య సమంత జోడీ నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టాలి అని భావించిన  ఆ విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ కి అనుబంధ సంస్థగా మరో బ్యానర్ ని స్థాపించాలని ఈ జంట సిద్ధమైనట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: