ప్రస్తుత పరిస్థితుల కంటే.. భవిష్యత్తులో కరోనా ఇంకెంత ప్రభావం చూపుతుందో అనే భయమే అందరికీ ఉంది. వ్యక్తులపై ప్రత్యక్షంగా వ్యవస్థలపై పరోక్షంగా దెబ్బ కొట్టింది కరోనా. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. ధియేటర్లు తెరిచాక సినిమా పరిస్థితేంటో సినిమా వాళ్ల ఊహకే అందటం లేదు. ఈ నేపథ్యంలో సినిమాల బడ్జెట్ పై పరిమితులు పెట్టుకోవాలని సినీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా బడ్జెట్ పై పరిమితులు విధించబోతున్నారని ఇండస్ట్రీల్లో ఓ టాక్ హల్ చల్ చేస్తోంది.

IHG's film with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KORATALA SIVA' target='_blank' title='koratala siva-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>koratala siva</a> gets launched

 

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ ఇప్పటికి 40శాతం షూటింగ్ పూర్తైంది. లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ సడలింపులతో ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన షెడ్యూల్స్ లో బడ్జెట్ పై పరిమితులు పెట్టుకోవడం ఉత్తమమని ఆచార్య టీమ్ ప్లాన్ చేస్తోందట. స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా ఖర్చు తగ్గించాలనేది టీమ్ ఆలోచనని సమాచారం. ఈ మార్పులతో బడ్జెట్ ఆదా కావటమే కానీ సినిమా కథలో గానీ ఔట్ పుట్ లో గానీ మార్పేమీ ఉండదని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.

IHG's Leaked Look from Acharya

 

ప్రస్తుత  పరిస్థితుల్లో ‘గతంలోలా జనం సినిమాలకు వస్తారా..’ అనే మీమాంశ సినీ వర్గాల్లో ఉంది. ఖర్చులు తగ్గించుకోవడం మినహా మార్గం లేదని సినీ వర్గాల అభిప్రాయం అని తెలుస్తోంది. చిరంజీవి కూడా సినిమాల బడ్జెట్ తగ్గించుకోవాలనే అందరికీ సూచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆచార్య బడ్జెట్ లో పరిమితులు విధించాలనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఈ వార్తపై సినిమా యూనిట్ నుంచి అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

IHG's film with <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KORATALA SIVA' target='_blank' title='koratala siva-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>koratala siva</a> titled ...

మరింత సమాచారం తెలుసుకోండి: