వర్మ సినిమాలే కాదు.. ఆయన మాటలు కూడా అర్థం కావడం లేదు. మనసులో ఉన్న దెయ్యాన్ని.. ఆలోచనలో ఉన్న శృంగాన్ని.. క్రైమ్ ను సినిమాలుగా మలిచే వర్మ.. రాజమౌళిపై కక్ష కట్టాడు. ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అవ్వాలని సినిమా ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటోందంటూ.. తన అభిప్రాయాన్నే టాలీవుడ్ పై నెట్టేశాడా.. జక్కన్న సక్సెస్ ను చూసి కుళ్లుకుంటున్నాడా.. 

 

వర్మ చేతల్లో చూపించలేకపోయినా.. మాటలతో నెట్టుకొచ్చేస్తున్నాడు. ఏదైనా మాట్లాడేసి.. కాంట్రవర్శీలకు తెరలేపే ఈ ఫౌడౌట్ డైరెక్టర్ కన్ను రాజమౌళిపై పడింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తీస్తున్న ట్రిపుల్ ఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వర్మ. 

 

సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటే. ఒకే కుటుంబం అని చెప్పడం పెద్ద బూతన్నాడు వర్మ. దీనికి రాజమౌళిని ఉదాహరణగా ఎంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ అని చెప్పకపోయినా.. రాజమౌళి తర్వాతి మూవీ ఫ్లాప్ అయితే.. సినిమా ఇండస్ట్రీ మొత్తం రోడ్డు మీదకొచ్చి డ్యాన్స్ చేస్తుందన్నాడు. కుళ్లు మానవ సహజం అని.. సక్సెస్ లో ఉన్న రాజమౌళిని చూసి తట్టుకోలేరన్నాడు వర్మ. ఎదుటి వాడి ఎదుగుదల జీర్ణించుకోలేననీ.. ఒక బిజినెస్ మేన్ ను చూసి మరో బిజినెస్ మెన్.. ఒక పొలిటీషియన్ మరో పొలిటీషియన్ ను చూసి కుళ్లుకుంటారన్నాడు వర్మ. 

 

ఆర్ఆర్ఆర్ ఫ్లాప్ అవ్వాలని సినిమా ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటుందన్న వర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన మనసులోని మాటను ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించాడని.. హీట్ ఎలాగూ కొట్టలేని వర్మ.. రాజమౌళిని చూసి కుళ్లుకుంటున్నాడంటున్నారు. జలస్ ఫీలయ్యే వాళ్లు కొందరు ఉండటం సహజమే అయినా.. ఇండస్ట్రీ మొత్తం ఇదే దారిలో ఉందనడం వర్మ మూర్ఖత్వానికి ప్రతీక అంటూ దుయ్యబట్టారు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళిని చూసి టాలీవుడ్ కాదు.. సౌత్ ఇండియా గర్వపడుతుంటే.. వర్మ మాత్రం కుళ్లుకుంటున్నాడని తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: