మొదటి చిత్రం 'దఢక్'తో 100కోట్ల క్లబ్ లోచేరి బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది దివంగత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్. ఈ చిత్రం తరువాత  జాన్వీ ..  గుంజన్ సక్సేనా అనే బయోపిక్ లో నటించింది. భారత మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవితం  ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ, గుంజన్ పాత్రలో నటించగా  పంకజ్ త్రిపాఠీ ,వినీత్ కుమార్ సింగ్ , అంగాద్ బేడీ కీలక పాత్రలు పోషించారు. 
 
ఇక ఈచిత్రాన్ని హిందీ తోపాటు తెలుగు ,తమిళ భాషల్లో ఈఏడాది సమ్మర్ లో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితిలేదు కాబట్టి ఈ బయోపిక్ ను  డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి  మేకర్స్ సిద్ధపడ్డారు. అందులో భాగంగా గుంజన్ సక్సేనా ను త్వరలో నెట్ ఫ్లిక్స్  డైరెక్ట్ గా స్ట్రీమింగ్ లోకి  తీసుకురానుంది. ఈవిషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రాన్ని శరన్ శర్మ తెరకెక్కించాడు. ఇదిలావుంటే బాలీవుడ్ నుండి త్వరలోనే శంకుతలా దేవి , గులాబో సితాబో సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటిటి లోకి  రానున్నాయి. అమేజాన్ ప్రైమ్ ఈ సినిమాలను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: