ఇప్పుడు తెలుగులో పాత హీరోయిన్ లకు చాలా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. పాత హీరోయిన్ లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఏ సినిమాలో అయినా సరే వాళ్లకు కచ్చితంగా ఏదోక పాత్ర అయితే ఉంటుంది. దీనితో వాళ్ళు కూడా ఇప్పుడు మన తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్ని రోజులు కేవలం గ్లామర్ తో మాత్రమే ప్రేక్షకులకు దగ్గరైన మాజీ హీరోయిన్  లు ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం అర్ధమవుతుంది. అగ్ర హీరోయిన్ లు అయినా సరే... 

 

ఇక ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా వారిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో మాజీ హీరోయిన్ స్నేహ ని తీసుకునే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటికే ఈ విషయాన్ని ఆమెకు ఫోన్ ద్వారా కూడా చెప్పాడు అని సమాచారం. ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె నటన విషయంలో ఏ డౌట్ అవసరం లేదు గాని పాత్ర పవర్ ఫుల్ గా ఉంటే ఆమె ఏ విధంగా నటిస్తుంది అనేది మాత్రం కాస్త అనుమానం. 

 

ఇప్పుడు ఆమె ఈ సినిమా కోసం కాస్త గట్టిగా కష్టపడుతున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏంటీ అనేది ఇంకా స్పష్టత రావడం  లేదు. దీని గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలుగులో. ఈ రెండు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. మరి ఎప్పుడు ఈ సినిమా లు విడుదల అవుతాయి అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె చెన్నై లోనే ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: