చాలా తక్కువ కాలంలో నటిగా మంచి పేరు తెచ్చుకుంది ప్రగతి. ఆమె సినిమాలు ఆమె నటన గురించి ప్రత్యేకంగా జనాలకు చెప్పాల్సిన ఆపని లేదు. ఏ హీరో సినిమాలో అయినా సరే ఆమె కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆమెకు ఉన్న గుర్తింపు ఆమెకు ఉంది. ఇప్పుడు ఆమె చాలా వరకు బిజీ గా ఉంది అనే చెప్పాలి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె విషయంలో కొన్ని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. ఆమెకు పోటీ ఎక్కువగా ఉంది అని ఈ పోటీ ని ఆమె తట్టుకునే పరిస్తితిలో లేదు అని అంటున్నారు. 

 

అవును ఇప్పుడు ఆమె పోటీ ని ఏ మాత్రం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటున్నారు. ఆమె అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా యాక్టివ్ గా ఉంది అని అంటున్నారు. తాను ఏ పాత్ర అయిన అచేస్తాను అనే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని జనాలు అంటున్నారు. అందుకే ఇప్పుడు ఆమె ఎక్కువగా వీడియో లను పోస్ట్ చేస్తూ తాను చాలా ఫిట్ గా ఉన్నాను అనే విషయాన్ని చెప్పాలి అని భావిస్తున్నారు అని అంటున్నారు. ఆమెకు అవకాశాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి అని అందుకే ఆమె జాగ్రత్త పడుతుంది అని అంటున్నారు. 

 

ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాల్లో మాత్రమే చేస్తుంది. గతంలో ఆమెకు చాలా ఆఫర్లు వచ్చేవి. ఇప్పుడు ఆమె ఆఫర్లను పవిత్రా లోకేష్ లాంటి వారు కొట్టేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆమె చాలా వరకు జాగ్రత్త పడుతూ సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అని జనాలు అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: