ఇప్పుడు టాలీవుడ్ లో జనాలు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే ఎంతో ఆసక్తిగా చదువుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూసే పరిస్థితి మన తెలుగులో ఉంది. టాలీవుడ్ లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ఎంతః చెప్పినా ఏ విధంగా చెప్పినా తక్కువే అనేది వాస్తవం. ఈ సినిమా విడుదల కోసం టాలీవుడ్ లో ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

 

సినిమా షూటింగ్ ని మొదలుపెట్టడానికి గానూ చిత్ర యూనిట్ ఇప్పుడు సిద్దమవుతుంది. ఇక ఇప్పుడు వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చాయి అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. అవును ఇప్పుడు ఈ సినిమాను మొదలుపెట్టే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంది అని సమాచారం. ఆమె ఇప్పుడు ఇండియా రావడం కాస్త కష్టంగానే ఉంది. 

 

ఆమెను తీసుకు రావడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పట్లో అంతర్జాతీయ విమానాలు కూడా ఉండే అవకాశం లేదు అనే విషయం అర్ధమవుతుంది. దీనితో ఇప్పుడు ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది చిత్ర యూనిట్ కసరత్తు చేస్తుంది. ఇక ఇప్పుడు ఆమె వచ్చినా సరే దాదాపు 28 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. దీనితో అసలు ఇప్పుడు ఈ సినిమాలో ఆమె పాత్ర విషయంలో ఎం చేద్దాం అనేది దర్శక నిర్మాతలకు అసలు అర్ధం కావడం లేదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: