దేశంలో ఫిబ్రవరి మాసం నుంచి కరోనా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  అయితే లాక్ డౌన్ పాటించినంత వరకు ప్రజలు ఇంటి పట్టున ఉంటూ.. జాగ్రత్తగానే ఉన్నారు. ఇటీవల లాక్ డౌన్ విషయంలో సడలింపులు ఎప్పుడైతే చేశారో.. మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,987 మందికి కొత్తగా కరోనా సోకింది.  ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,66,598కి చేరగా, మృతుల సంఖ్య 7,466కి చేరుకుంది. 1,29,917 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,29,215 మంది కోలుకున్నారు. 

 

దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. ఇక దేశ వ్యాప్తంగా 331 మంది మరణించారు.  దేశవ్యాప్తంగా కరోనా రక్కసి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో తలైవా రజనీకాంత్ కల్లోల పరిస్థితులపై స్పందించారు. కరోనా మహమ్మారి నివారణలో ముందు జాగ్రత్తను మించింది లేదని అభిప్రాయపడ్డారు. శానిటైజేషన్, మాస్కులు, భౌతికదూరం కరోనా కట్టడిలో కీలకమైన అంశాలని రజనీ సూచించారు.

 

మన ప్రాణాలు మన చేతిలోనే ఉన్నాయి.. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకు హాని ఉంటుందని అన్నారు. కరోనా కారణంగా ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటి వాళ్లను ఆదుకునేందుకు చాలామంది ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో సాయం అందించడం చాలా గొప్ప విషయమని తలైవా ఓ సందేశంలో తెలిపారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: