నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్  సినిమా అనే నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు మాస్ ఆడియెన్స్ కూడా ఆ సినిమాపై అంచనాలు పెట్టుకుంటారు.  ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో ఈసారి హ్యాట్రిక్ మూవీపై తారాస్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగినట్టుగానే సినిమా గురించి సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చిత్రయూనిట్. జూన్ 10 బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందే బర్త్ డే  ట్రీట్ ఇచ్చారు. 

 

బిబి 3 ఫస్ట్ రోర్ అంటూ ఓ ఫస్ట్  రిలీజ్ చేశారు. పంచె కట్టుతో బాలయ్య  లుక్ అదిరింది. బోయపాటి శ్రీను బాలకృష్ణ లుక్, డైలాగ్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. అందుకు తగినట్టుగానే సినిమా ఫస్ట్ లుక్ ఉందని చెప్పొచ్చు. ఇక ఈ టీజర్ లో ఎప్పటిలానే ఓ అదిరిపోయే డైలాగ్.. ఓ కిక్కు ఎక్కించే ఫైట్ తో రిలీజ్ చేశాడు బోయపాటి శ్రీను. వినయ విధేయ రామ సినిమా ప్లాప్ తో తన మీద వచ్చిన విమర్శలకు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధం అవుతున్నాడు బోయపాటి శ్రీను.

 

బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులతో పాటుగా రీసెంట్  వచ్చిన రూలర్ కూడా ప్లాప్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. అంతా బాగానే  లుక్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంకా టైటిల్ సస్పెన్స్ పెట్టడం ఏంటన్నది తెలియట్లేదు. మాములుగా బాలకృష్ణ సినిమాలకు టైటిల్ దాచిపెట్టడం లాంటి సెంటిమెంట్స్ ఏమి ఉండవు. మరి కొత్తగా ఈ టైటిల్ దాచడం వెనుక సీక్రెట్ ఏంటో తెలియాల్సి ఉంది. అయితే ఈరోజు టీజర్ వదిలి రేపు   వదులుతారేమో అని నందమూరి ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: