ఇండస్ట్రీలో చాలా సినిమా కథలు అనేకమంది వద్దకు వెళ్తూ ఉంటాయి. ఒకే కథను చాలామంది వింటారు. నచ్చినవారు చేస్తారు.. నచ్చని వారు రిజెక్ట్ చేస్తారు. దీంతో ఒకరు చేయాల్సిన సినిమాలు మరో హీరో చేస్తాడు. అలా తెరకెక్కిన సినిమాలెన్నో తెలుగులో ఉన్నాయి. ఒక్కోసారి అవి హిట్ అవుతాయి.. మరోసారి ఫెయిల్ అవుతూంటాయి. ఇది సహజం. ప్రస్తుతం ఇండస్ట్రీలో అలా కథలు తారుమారైన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ – గోపీచంద్ లు ఇద్దరి వద్దకూ వెళ్లిన కథలు ఇలానే ఎక్సేంజ్ అయ్యాయని తెలుస్తోంది.

IHG

 

గత ఏడాది కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘రూలర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కథ పరుచూరి మురళి అందించాడు. నిజానికి ఈ కథను మొదట గోపీచంద్ కు వినిపించాడట మురళి. కథ నచ్చక గోపీచంద్ రిజెక్ట్ చేయడంతో బాలకృష్ణకు వినిపించాడట మురళి. బాలయ్యకు కథ నచ్చి సినిమా చేశాడు. ఆ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. అలానే గోపీచంద్ త్వరలో తేజ దర్శకత్వంలో ‘అలివేలు వెంకటరమణ’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ కథను తేజ మొదట బాలయ్యకు వినిపించాడట. కానీ.. బాలయ్య రిజెక్ట్ చేయడంతో ఈ కథను గోపీచంద్ కు వినిపించాడట తేజ. కథ నచ్చి గోపీచంద్ ఓకే చెప్పాడట.

IHG

 

ఇలా వీరిద్దరూ అనుకోకుండా సినిమాలు ఎక్సేంజ్ చేసుకున్నట్టయింది. ఇండస్ట్రీలో ఇదంతా మామూలే అయినా ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాకే ‘అలివేలు వెంకటరమణ’ తెరకెక్కుతుంది. బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్.. సిరీస్ సినిమాల నుంచి తేజ దర్శకుడిగా తప్పుకున్న విషయం తెలిసిందే.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: