డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. టెంపర్ తర్వాత సరైన హిట్టులేని పూరి మళ్ళీ తన సత్తా చాటాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా చేస్తున్న పూరి ఈ ప్రాజెక్ట్ ను కరణ్ జోహార్ తో కలిసి చేస్తున్నాడు. కేవలం హిందీ వర్షన్ కు మాత్రమే కరణ్ జోహార్ నిర్మాతగా ఉంటాడని అనుకున్నారు కానీ సినిమా నిర్మాణంలో భాగం అవుతున్నాడట. అంతేకాదు పూరి టాలెంట్ చూసి నచ్చిన కరణ్ జోహార్ మరో రెండు ప్రాజెక్టులు డీల్ సెట్ చేసుకున్నాడట. 

 

విజయ్ తో చేస్తున్న సినిమాతో కలిపి మొత్తం 3 సినిమాలు పూరి, కరణ్ జోహార్ కాంబినేషన్ లో వస్తాయని తెలుస్తుంది. విజయ్ సినిమా ఇప్పటికే 40 శాతానికి పైగా పూర్తవగా లాక్ డౌన్ ఎత్తేయగానే షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది. ఇక ఈ మూవీ పూర్తి చేసిన తర్వాత పూరి మిగతా రెండు సినిమాలకు కథలు రాస్తాడట. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ఫెయిల్యూర్ అందుకున్న విజయ్ దేవరకొండ పూరి సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. 

 

డైరకర్స్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ అయిన పూరి.. హీరోల్లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ అయిన విజయ్ తో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. క్యారక్టరైజేషన్ మీద సినిమాలు నడిపించే పూరి విజయ్ సినిమాను అంచనాలకు మించి ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సినిమా హిట్టయితే కరణ్ జోహార్ కూడా పూరితో మిగతా రెండే కాదు మరికొన్ని సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: