నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతుంది. సింహా, లెజెండ్ వంటి భారి కమర్షియల్ సక్సస్ ల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రాబోతుంది. కాగా బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా నందమూరి అభిమానులకు ..ప్రేక్షకులను సర్ప్రైజ్ గిఫ్ట్ ని ఇచ్చారు బోయపాటి బృందం. 

 

IHG

 

సినిమా నుండి రీసెంట్ గా టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ రోర్ పేరుతో వచ్చిన ఈ టీజర్ లో ''ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి... శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనే దానికి.. శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా అనే దానికి చాలా తేడా ఉంది రా.. అంటూ బాలయ్య .. తన మార్క్ డైలాగ్ తో అదరగొట్టాడు.

 

IHG

 

చెప్పాలంటే ఇంత పవర్ ఫుల్ గా బాలయ్యను సింహ, లెజెండ్ సినిమాలలోనే చూశాము. మళ్ళీ ఈ సినిమాలోనే బాలయ్య పాత్రలో వేయిట్ కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఫస్ట్ రోర్ చూసిన అభిమానులు సింహా ప్లస్ లెజెండ్ కలిపితే "BB3" అని ఆనందంగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ చాలాకాలానికి బాలయ్య బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ని కొట్టడం ఖాయం అని చెప్పుకుంటున్నారు.

 

IHG

 

ఇక ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర అని స్వయంగా బోయపాటి శ్రీను వెల్లడించారు. ప్రస్తుతానికి ఆ పాత్రని రివీల్ చేయకుండా సస్పెన్స్ లో ఉంచిన బోయపాటి ఇప్పుడు రిలీజైన టీజర్ లో కనిపిస్తున్న పాత్ర మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని క్లూ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: