సరైనోడుతో తిరుగులేని మాస్ డైరెక్టర్ అనిపించుకున్న బోయపాటి శ్రీను ,వినయ విధేయరామ తో అబాసుపాలయ్యాడు. బోయపాటి ఇప్పటివరకు 8 సినిమాలు చేయగా అందులో దమ్ము, వివిఆర్ మాత్రమే పరాజయం చెందాయి. అయితే దమ్ముకు ఈ డైరెక్టర్ పెద్దగా ట్రోలింగ్  ఏం ఎదుర్కోలేదు కానీ వివిఆర్ కు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ విమర్శలు బోయపాటి ని తీవ్రంగా బాధించినట్లున్నాయి అందుకే తన ట్యాలెంట్ ఏంటో ఇప్పుడు ఓచిన్న టీజర్ తో చూపెట్టాడు. 
 
వివిఆర్ తరువాత బోయపాటి ,బాలయ్య తో మూడో సారి సినిమా చేస్తున్నాడు. ఈకాంబినేషన్ లో గతం లో వచ్చిన సింహ ,లెజెండ్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం తో ఈమూడో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి. ఆ ఆంచనాలకు తగ్గట్లే సినిమా తెరకెక్కుతుందని టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది. రేపు బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా ఈరోజు ఈ సినిమా టీజర్ ను  విడుదలచేశారు.
 
ఇక ఈ టీజర్ యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. బాలయ్య లుక్ దగ్గర్నుండి , డైలాగ్  , బీజీఎమ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్బంగా బోయపాటి టేకింగ్ పై ప్రశసంలు కురిపిస్తున్నారు నెటిజన్లు. బోయపాటి ఈ సారి ఫైర్  మీద వున్నాడు మరో బ్లాక్ బాస్టర్ పక్క అని కొందరు కామెంట్లు పెడుతుండగా మాస్ డైరెక్టర్ బోయపాటి ఈజ్ బ్యాక్ ఈసారి  తిరుగుండదని మరికొన్ని కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి వివిఆర్ తో తిట్టించుకున్నవారితోనే బోయపాటి ఇప్పుడు మళ్ళీ శభాష్ అనిపించుకుంటున్నాడు. యాక్షన్ ఎంటెర్టైనెర్ గా రానున్న ఈచిత్రానికి  మోనార్క్ అనే టైటిల్ ను పెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది కానీ టీజర్ లో  మాత్రం సినిమా టైటిల్ ఏంటో చెప్పలేదు. భారీ బడ్జెట్ తో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  థమన్ సంగీతం అందిస్తున్నాడు. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: