నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ తన 60 పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన తదుపరి చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు. చిత్రానికి సంబంధించిన చిన్న వీడియోను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ద్వారకా క్రియేషన్స్ వారు విడుదల చేశారు. 'ఫస్ట్ రోర్' పేరుతో రిలీజ్ అయిన టీజర్ ఇప్పుడు నెటిజన్లలో చాలా రెద్ద హవా ను పెద్ద క్రియేట్ చేసింది.

 

ఇప్పటికే బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్ లో 'సింహ', 'లెజెండ్' అనే రెండు భారీ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక చిత్రంలో బాలయ్య చాలా రోజుల తర్వాత తెల్లచొక్కా మరియు తెల్ల పంచె వేసి చాలా మాస్ గా కనిపించాడు. ఇక టీజర్ విషయానికి వస్తే బాలయ్య చెప్పిన డైలాగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ని ఉద్దేశించినట్లు గా ఉంది అని ఆంధ్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

 

"ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోశ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా? అనేదానికి…. శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉంది రా లం***డి కొ*కా....అని బాలయ్య సీరియస్ గా డైలాగ్ చెప్పడం విశేషం.

 

గతంలో లో లో వైసీపీ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని ఇవ్వలేదు అని తెలుగుదేశం పార్టీ వారి నుండి వచ్చిన ఆరోపణలకు మంత్రి కొడాలి నాని మీడియా ముందు మాట్లాడుతూ - "సన్న బియ్యం ఇస్తామని ఎవరు చెప్పారు? మీ అమ్మ మొగుడు చెప్పాడా..?" అని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్న విషయం తెలిసిందే. టిడిపి పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే అయిన బాలయ్య దానికి కౌంటర్ గానే డైలాగ్ ను తన సినిమాలో పెట్టుకున్నాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 

కానీ కొందరు మాత్రం ఇది కేవలం యాదృచ్చికం అని…. సినిమా లో డైలాగ్ ను డిమాండ్ చేసే ముఖ్యమైన సన్నివేశం ఉంటుందని భావిస్తున్నారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో గతంలో లెజెండ్ మరియు సింహా చిత్రాలు వచ్చాయి. రెండు భారీ హిట్ చిత్రాలలో కూడా బాలయ్య చెప్పిన డైలాగులు రాజకీయ పరమైన ఉద్దేశానికి చాలా దగ్గరగా ఉన్నాయి అని గతంలో కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎనీ వే హ్యాపీ బర్త్ డే బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: