కరోనా మహమ్మారి వల్ల అన్ని పరిశ్రమలతో పాటుగా సినిమా షూటింగ్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. మూడు నెలలు గ్యాప్ తర్వాత  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్స్ కు అనుమతిస్తూ ప్రకటనలు చేశారు. అయితే ఎప్పటిలా  షూటింగ్ చేస్తామంటే కుదరని పని.. షరతులతో కూడిన అనుమతులు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. షూటింగ్  జరుపుకోవాలి.. షూటింగ్ లొకేషన్ లో ఎలాంటి  తీసుకోవాలి అన్న విషయాల మీద ఒక ప్రకటన చేశారు. ఇకపై షూటింగ్స్ చేయాలంటే అవి తప్పకుండా పాటించాల్సిందే అని తెలుస్తుంది.

 

ఇంతకీ ఆ నియమ నిబంధనలు ఏంటి అంటే.. ఎంత పెద్ద బజెట్ సినిమా అయినా సరే షూటింగ్ స్పాట్ లో 40 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతేకాదు షూటింగ్ స్పాట్ ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర శానిటైజర్, హ్యాండ్ వాష్ కంపల్సరీ ఉండాలి. షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరు తమ  డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. యూనిట్  భద్రత నిర్మాతదే.రోజూ ఉదయాన్న భౌతిక దూరం గురించి చిత్రయూనిట్ కు వివరించాలి. మాస్క్ ధరిస్తూ, సోషల్ డిస్టెన్స్  మెయిన్ టైన్ చేయాలి. 

 

షూటింగ్ మొదలైనప్పటి నుండి ముగిసే వరకు ఖచ్చితంగా ఒక డాక్టర్ ఎప్పుడూ అందుబాటులో ఉండాల్సిందే. షూటింగ్ స్పాట్ లో పాన్, సిగరెట్ వంటివి నిషేధించాలి. ఆర్టిస్టుల కార్లు కూడా పూర్తిగా శానిటైజ్ చేశాకనే వాళ్ళ కోసం పంపాలి. బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్స్ చేయకూడదు. కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్స్ కు అనుమతి లేదు. మేకప్ వేసుకున్న ఆర్టిస్టులకు ఫేస్ షీల్డ్ ఉపయోగించుకోవాలి. ప్రస్తుతానికి సగం పూర్తైన సినిమాలను మాత్రం ఇమిడియెట్ గా మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇలా  జాగ్రత్తలతోనే సినిమా షూటింగ్స్ చేయాలంటే ప్రభుత్వం ప్రకటించింది. మరి వీటిని సరిగా పాటించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతల మీద ఉంది.           

మరింత సమాచారం తెలుసుకోండి: