కరోనా తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులొస్తాయని.. కొత్త కొత్త ఛేంజస్ చూస్తారని టాలీవుడ్ జనాలు చెబుతున్నారు. అయితే ఇండస్ట్రీలో మార్పులతో పాటు హీరోయిన్ లలోనూ కొత్త దనం కావాలంటున్నారు నిర్మాతలు. న్యూ టాలెంట్ ఎంట్రీ ఇస్తేనే సమస్యలు తీరతాయంటున్నారు మేకర్స్. 

 

తెలుగులో ఇప్పుడు చాలామంది హీరోయిన్లు ఉన్నారు. అనుష్క నుంచి మొదలుపెడితే రష్మిక మందన్న వరకు బోల్డంత మంది ఉన్నారు. అయితే ఇంత మంది ఉన్నా కొత్త వాళ్లు రావాల్సిన అవసరముందని అంటున్నారు సినీజనాలు. ఎందుకంటే అనుష్కకు ఏజ్, బరువు రెండూ పెరిగిపోయాయి. ఇక కాజల్, తమన్నా సీనియర్స్ కేటగిరీలో చేరారు. 

 

సమంత పెళ్లి తర్వాత కమర్షియల్ మూవీస్ కు దూరమైంది. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ లో నటిస్తోంది. ఇక ఇప్పుడు టాప్ ఛైర్ కు దగ్గరైనట్టు కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ ను ఇప్పుడు అందరూ పక్కనపెట్టేస్తున్నారు. బబ్లీ గర్ల్ రాశీ ఖన్నాని స్టార్ హీరోలు పెద్దగా ప్రిఫర్ చేయడం లేదు. లావణ్య త్రిపాఠి జోరు తగ్గిపోతోంది. 

 

పెర్ఫామెర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కమర్షియల్ రోల్స్ ను పక్కన పెట్టేస్తున్నారు. ప్రేమమ్ తో సౌత్ ఇండియాను మెప్పించిన సాయి పల్లవి రెగ్యులర్ క్యారెక్టర్స్ ను టచ్ చేయడం లేదు. స్కిన్ షోకు దూరంగా స్కోప్ ఉన్న రోల్స్ ప్లే చేస్తోంది. ఇక లేడీ కమల్ హాసన్ అనే ఇమేజ్ తెచ్చుకున్న నివేదా థామస్ ని మాస్ మూవీస్ కు తీసుకోలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. 

 

టాలీవుడ్ లో ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్న హీరోయిన్లు పూజా హెగ్డే, రష్మిక మందన్న. సూపర్ హిట్స్ తో సవారీ చేస్తూ చైర్ కోసం పోటీపడుతున్నారు. అయితే నంబర్ గేమ్ లో దూసుకుపోతున్నా.. మేకర్స్ కు వీళ్లు ఫస్ట్ ప్రియారిటీ కాలేకపోతున్నారు. సమ్ థింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ తో వీళ్లను కాదని.. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు దర్శకనిర్మాతలు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: