బాలయ్య ఎంత ముక్కుసూటిగా ఉంటారో ? తన అభిమానులు అన్నా సినిమా ఇండస్ట్రీ అన్నా.. తన తోటి నటీనటులు అన్న అంతే ప్రేమతో ఉంటారు. అయితే బాలయ్య నిజ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. తన పిల్లలను సైతం అంతే క్రమశిక్షణతో పెంచారు. తప్పు అనేది ఎవరు చేసినా ఒకటే అన్నది బాలయ్య సిద్ధాంతం. తప్పు బయటి వాడు చేసినా..న మన ఇంట్లో వాళ్ళు చేసినా.. బాలయ్య స్పందన ఒకే విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే బాలయ్య బయటకు వచ్చినప్పుడు ఆయన్ను చూడాలన్నా ఉత్సాహంతో అభిమానులు ఆయన మీదకి రా వచ్చిన సందర్భాల్లో ఆయన కసురుకోవడం... ఒక‌టి రెండు సార్లు చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొందరు బాలయ్యపై విమర్శలు కూడా చేశారు.

 

ఇక ఇండస్ట్రీలో కొందరు బాలయ్య టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం కూడా జరుగుతూ వస్తోంది. వాస్తవంగా చూస్తే బాలయ్య ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడటం తోనే ఆయన అందరికీ టార్గెట్ అవుతున్నారు. అయితే బాలయ్య మాట్లాడిన దాంట్లోనే నూటికి నూరు శాతం న్యాయం ఉందని కూడా ఇండస్ట్రీలో మెజార్టీ వర్గాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. ఇక బాలయ్యకు కుట్రలు.. కుతంత్రాలు చేయడం ఒకరిని అగౌరవ పరచటం గ్రూపులో పెట్టడం అనేవి ఎంత మాత్రం తెలియవు. అందుకే ఈ తరం హీరోల్లో కూడా అందరూ ఆయన్ను ఎంతో గౌరవిస్తారు. బాలయ్య  త‌రం హీరోలతో పోలిస్తే ఆయనకు వచ్చిన హిట్లు తక్కువే.

 

అయితే బాలయ్య చేసినన్ని రోల్స్ కానీ పౌరాణికం.. సాంఘికం, జానపదం ఇలా ఏ తరహా పాత్రను అయినా అవలీలగా పోషించి తన తండ్రికి తగ్గ త‌న‌యుడు అనిపించుకోవడం ఆయనకు మాత్రమే చెల్లింది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మంది తెలుగు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించి తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన ఇప్పటికీ.. ఎప్ప‌ట‌కీ చెక్కు చెదరని ముద్ర వేసుకురు. సహజంగానే ఒకరికి మంచి పేరు ఉంటే సహించలేని కొందరు స్వార్ధపరులు బాలయ్యపై విమర్శలు చేస్తుంటారని నందమూరి అభిమానులు ఆరోపిస్తున్నారు.

 

వాస్తవానికి ఇప్పుడు తెలుగు సినిమా హీరోల లో బాలయ్యలాగా సామాజిక సేవ చేసే వారు ఎవరూ లేరనే చెప్పాలి. అయితే బాలయ్య వారిలా గోరంత చేసి కొండంత చెప్పుకున్నట్టు ఏనాడు డబ్బా కొట్టుకోరు... అదే బాలయ్య ప్రత్యేకత. అందుకే ఆయన వ్య‌క్తిత్వ‌మే ఆయ‌న‌ను మిగిలిన హీరోలతో పోలిస్తే ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: