యువరత్న నందమూరి బాలకృష్ణ తన వ్యక్తిత్వంతో సామాజిక సేవ తోనూ... సినిమాల్లోనూ హీరోగా నటించడం ద్వారా ఎంతో మంది ప్రముఖుల‌ను సైతం తన అభిమానులుగా చేసుకున్నారు. బాలయ్య కు ఉన్న‌ ముక్కుసూటి వ్యక్తిత్వమే ఆయనకు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇదిలా ఉంటే బాలయ్య ను అభిమానించే ప్రముఖుల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఒకరు. వైయస్ జగన్ కు చిన్నప్పటి నుంచి బాలయ్య అన్నా.. బాలయ్య సినిమాలు అన్నా ఎంతో ఇష్టం. బాలయ్య సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు రాయలసీమ జిల్లాల్లో నాడు యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి - బాలయ్య కాంబినేషన్లో భారీగా ఫ్లెక్సీలు వెలిసేవి.

 

సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ సినిమాలు రిలీజ్ అవుతున్న టైం లో జగన్ అభిమానులు థియేటర్ల వద్ద చేసే హంగామా అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. థియేటర్ల ముందు బాలయ్య - జగన్ భారీ కటౌట్లు ముందు పొట్టేళ్లను బ‌లి ఇచ్చి నానా హంగామా చేసి మరి సినిమా తొలి వేయించేవారు. అప్పట్లో జగన్ కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘాల‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇక రాజకీయంగా ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు పార్టీలు ఉండడంతోపాటు... వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తున్నా.. సీనియర్ ఎన్టీఆర్ అన్నా... బాల‌య్య అన్నా ఎప్పటికీ జగన్ ఎంతో అభిమానిస్తారు.

 

చంద్రబాబుతో జగన్ కు తీవ్రమైన విబేధాలు ఉన్నా బాలయ్యను మాత్రం జ‌గ‌న్‌ ఎప్పుడు విమర్శించ లేదు. జగన్ సైతం ఎన్నోసార్లు రాజకీయ విమర్శలు చేసే టప్పుడు కూడా బాలయ్యకు ఏం తెలియదు... బాలయ్య చాలా మంచి వాడిని ఓపెన్ గానే చెప్పిన సంఘటనలు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: