దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు అని వార్తలు రాగానే ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన వేణు శ్రీరామ్ ‘ఖుషీ’ మూవీని 22 సార్లు ‘గబ్బర్ సింగ్’ మూవీని 22 సార్లు చూడటమే కాకుండా ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడాలి అనే ధ్యేయంతో తన ఇండస్ట్రీ కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చాడు.


అలాంటి వేణు పవన్ కళ్యాణ్ తో ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీని తీస్తున్న విషయం తెలిసిందే. కరోనా సమస్యతో లాక్ డౌన్ లేకుండా ఉండి ఉంటే ఈపాటికి ఈ మూవీ విడుదల అయిపోయి ఉండేది. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరుకొని ఆగిపోయిన పరిస్థితులలో ఈనెల తిరిగి షూటింగ్ లు మొదలయ్యాక వేగంగా పూర్తి చేసి ఈఏడాది అన్నీ కుదిరితే దసర పండుగకు విడుదలచేయాలి అన్న ఉద్దేశ్యంలో ఉన్నారు.


ఇలాంటి పరిస్థితులలో ఒకప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ నుండి ప్రతిరోజు ఎదో ఒక విషయం నేర్చుకోవచ్చు అని చెపుతూ తన చుట్టూ ఉన్న అందరి వ్యక్తులను సమానంగా గౌరవిస్తూ ఎవరినైనా ‘గారు’ అని శంభోధించడం పవన్ గొప్పతనం అని అంటున్నాడు.

 

పవన్ ఏవ్యక్తినైనా కలిసినప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతూ ఈమధ్య ఏమి మంచి పుస్తకాలు చదివారు అని అడుగుతూ ఉంటాడని తనకు తెలియని విషయాలు తనకన్నా తక్కువ వారు దగ్గర తెలుసుకోవడానికి కూడ పవన్ ఏమాత్రం మొహమాట పడడు అంటూ కామెంట్స్ చేసాడు. వాస్తవానికి ‘వకీల్ సాబ్’ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాస్తానని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ త్రివిక్రమ్ మాటలు వ్రాయలేకపోయినా తాను ఆలోటును ఎక్కడా కనపడనీయకుండా ‘వకీల్ సాబ్’ లో చూపించ బోతున్నాను అని అంటున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: