మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ విశేష స్పందన లభించింది. 1920 ప్రాంతంలో సీతారామరాజు ఇంటి నుండి బయటకి వెళ్ళిపోయినపుడు ఏం జరిగిందనే కథని కల్పితంగా చూపించబోతున్నాడు. అయితే ఇటు ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న రామ్ చరణ్, మెగాస్టార్ ఆచార్యలో కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడని తెలిసిందే.

 

ఇందులో నటించడానికి రాజమౌళి అనుమతి కూడా తీసుకున్నాడు. ఈ రెండు సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ సినిమా ఎవరితో ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న మరో హీరో ఎన్టీఆర్, తన తర్వాతి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని ప్రకటించినప్పటి నుండి రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై వార్తలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ వంటి పాన్ ఇండియా మూవీ  తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడనే విషయమై అనేక వార్తలు వస్తున్నాయి. 

 

ఐతే ఈ విషయమై ఇంకా క్లారిటీ రాకముందే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా కథ గురించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. తన తర్వాతి చిత్రంలో రామ్ చరణ్ పోలీస్ అఫీసరుగా కనిపించనున్నాడట. ఆస్తి కోసం చిన్న పాపని చంపడానికి ప్రయత్నించే విలన్ల నుండి కాపాడే పోలీస్ గా రామ్ చరణ్ కనిపిస్తాడని అంచనా వేస్తున్నారు.

 

అయితే ఈ లైన్ ని చూస్తుంటే చిరంజీవి పసివాడి ప్రాణం గుర్తుకు వస్తుంది. మరి ఈ లైన్ ని కావాలనే సృష్టించారో లేదా నిజంగా నిజమో అనే విషయం మాత్రం తెలియదు.  అయితే ప్రస్తుతం అటు ఆర్.ఆర్.ఆర్ లోనూ, ఇటు ఆచార్యలోనూ నటిస్తున్న రామ్ చరణ్, ఇప్పుడప్పుడే తన నెక్స్ట్ చిత్రం గురించి బయటకి వెల్లడించే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: