సాధారణంగా కొందరు నటుల విషయంలో కొన్ని కొన్ని విమర్శలు ఉంటాయి. ఏ విధంగా చూసుకున్నా సరే వాళ్ళ వ్యక్తిగత స్వార్ధం చూసుకుని సినిమాలు చేస్తారు అంతా వాళ్లకు అనుకూలంగా ఉండే విధంగా సినిమాలు చేస్తారు అనే పేరు ఉంటుంది చాలా మందికి. స్టార్ హీరో అయినా స్టార్ హీరోయిన్ అయినా సరే వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఆర్ధికంగా చూసుకుంటారు అని నిర్మాత ఎన్ని ఇబ్బందులు పడినా సరే వాళ్లకు అనవసరం అని భావిస్తూ ఉంటారు. ఇక కొంత మంది నటులు మాత్రం వాళ్లకు  ఏ ఇబ్బంది వచ్చినా పర్వాలేదు అనుకునే విధంగా ఉంటారు.

 

నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన ఏ సినిమా చేసినా సరే నిర్మాత ఇబ్బంది పడకుండా సినిమా చేస్తూ ఉంటారు అనే పేరు ఆయనకు ఉంది. ఏ సినిమా అయినా సరే నిర్మాతకు నష్టం వస్తే తనకు ఇచ్చిన నగదు లో కొంత ఆయనకు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తారు అని చాలా మంది అంటూ ఉంటారు. అందుకే చాలా మంది చిన్న చిన్న నిర్మాతలు బాలయ్యతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని కామెంట్ చేస్తూ ఉంటారు. బాలయ్య ముందు నుంచి కూడా నిర్మాతలను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు అని అంటారు. 

 

అందుకే అగ్ర దర్శకుల కంటే ఆయనతో చిన్న దర్శకులే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించి సినిమాలు చేస్తారు అని సినిమాకు కనీసం మొత్తం వస్తుందని నష్టపోయే అవకాశాలు ఏమీ ఉండవు అని అంటారు. అటు తమిళంలో కూడా బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఇందుకే అని అంటారు. కాగా బాలయ్య ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: