షష్టిపూర్తి సందర్భంగా బాలకృష్ణ చేసిన సాహసాసం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.  తెలుగు సినిమా క్లాసిక్ సాంగ్స్  లో ఇప్పటికీ టాప్ 10 లో  కొనసాగుతున్న ఘంటసాల పాడిన ‘శివ శంకరీ శివానంద లహరి’ పాట వినని తెలుగువాడు ఉండడు. ఈపాటలో దేవులపల్లి కృష్ణశాస్త్రి పద సాహిత్యానికి ఘంటసాల గాన మాధుర్యం తోడవ్వడంతో ఈపాట విని ఇప్పటికీ తెలుగు ప్రజలు పులకరిస్తూనే ఉంటారు.


ఇలాంటి క్లాసిక్ సాంగ్ ను పాడటానికి ఇప్పటి వరకు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కూడ ఎప్పుడు ప్రయత్నించలేదు. ఈ పాట పాడడానికి ఘంటసాల ఎంత కష్టపడింది ఇప్పటికీ ఆతరం వారు చెపుతూ ఉంటారు. అయితే ఈ విషయాలను పట్టించుకోకుండా తాను అనుకున్నదే తడవుగా ఈపాటను పాడటమే కాకుండా తన షష్టిపూర్తి సందర్భంగా విడుదలచేసి అందరికీ షాక్ ఇచ్చాడు. 


వాస్తవానికి బాలకృష్ణ ఈపాటను ఎలా పాడాడు అక్షరాలు అన్నీ స్పష్టంగా స్వర బద్దంగా పలికాయా లేదా ? అన్న విషయాన్ని పక్కకు పెడితే బాలయ్య నోటివెంట వచ్చిన ఈపాట విన్న సగటు తెలుగు అభిమాని ఆశ్చర్య పడుతున్నారు. ఈ పాటకు బాలకృష్ణ ఎంతవరకు న్యాయం చేసాడు అన్న విషయాన్ని పక్కకు పెడితే ఈ పాటను ఎంచుకున్న విషయంలో బాలకృష్ణ సాహసానికి ఇండస్ట్రీ వర్గాలతో పాటు సగటు సినిమా అభిమానులు కూడ ఆశ్చర్య పోతున్నారు.


ఇలాంటి విషయాల పై స్పందించడంలో ముందు వరసలో ఉండే రామ్ గోపాల్ వర్మ నిన్నరాత్రి బాగా పొద్దుపోయాక  స్పందించాడు. ఈ పాట బాలయ్య నోటివెంట విన్న తరువాత బాలసుబ్రహ్మణ్యం మహ్మద్ రఫీ జూనియర్ సింగర్స్ అని అనిపిస్తోంది అంటూ బాలకృష్ణకు తన అభినందనలు తెలియచేసాడు. అయితే బాలయ్య పాట పై విమర్శకుల అభిప్రాయాలను పట్టించుకోకుండా అభిమానులు మాత్రం ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. ఒక విధంగా నేటితరం ప్రేక్షకులు మరిచిపోయిన ఈ పాటను బాలయ్య గుర్తు చేయడం ఆయన అభిరుచికి నిదర్సనం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: