ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో పూరితో పాటుగా రామ్ కూడా హిట్ ట్రాక్ ఎక్కాడు. కొన్నాళ్ళుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేని రామ్ ఇస్మార్ట్ హిట్ మాంచి కిక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్, కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రెడ్ సినిమా చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్టైన తడమ్ రీమేక్ గా వస్తున్న ఈ రెడ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ఈ సినిమా నుండి వచ్చిన ఐటమ్ సాంగ్ ఈమధ్యనే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 

 

ఇదిలాఉంటే రామ్ సరికొత్తగా ఒక అరుదైన రికార్డు నెలకొల్పాడు. స్టార్స్ కూడా అందుకోలేని ఈ రికార్డు క్రేజీగా మారింది. ఇంతకీ రామ్ ఎందులో రికార్డ్ కొట్టాడు అంటే తన యూట్యూబ్ ఛానెల్ తో 1 మిలియన్ సబ్ స్క్రైబర్స్ సాధించాడు. స్టార్స్ కూడా ఈ రేంజ్ సబ్ స్క్రిప్షన్ సాధించలేదు కానీ రామ్ మాత్రం ఈ రికార్డు అందుకున్నాడు. తన సినిమాల టీజర్, ట్రైలర్స్ తో యూట్యూబ్ లో భారీ వ్యూస్ సాధించే రామ్ ఇస్మార్ట్ శంకర్ ద్వారా చాలా సబ్ స్క్రైబర్స్ ఏర్పరచుకున్నాడు. 

 

స్టార్స్ కూడా ఈ విషయంలో వెనుక ఉండగా రామ్ మాత్రం యూట్యూబ్ సబ్ స్క్రిప్షన్ లో దూసుకెళ్తున్నాడు. తడమ్ రీమేక్ గా వస్తున్న రెడ్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న రామ్సినిమా సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రామ్ సరసన నివేదా థామస్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాల తర్వాత రామ్, కిషోర్ తిరుమల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అవడంతో రెడ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడు. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: