గత కొన్ని రోజులుగా రీమేక్ సినిమాల హవా బాగా పెరిగింది. ఒక భాషలో సూపర్ హిట్ అయిన చిత్రాలని మరో భాషలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ దక్షిణాది సినిమాల మీద బాగా కన్నేసింది. అయితే మన సినిమాలు మనదేశంలో ఇతర భాషల్లో రీమేక్ అవడం సాధారణ విషయమే. అలాగే ఇతర దేశాల్లోని ముఖ్యంగా ఫ్రెంచ్ సినిమాలని, కొరియన్ సినిమాలని కూడా రీమేక్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

 

 

కానీ మన సినిమాలని ఇతర దేశాల వారు రీమేక్ చేసినట్లు వచ్చిన వార్తలు చాలా తక్కువ. తాజాగా కొలీవుడ్ హీరో ధనుష్ నటించిన అసురన్ చిత్రం చైనాలో రీమేక్ అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన అసురన్ చిత్రం తమిళనాట సూపర్ సక్సెస్ గా నిలిచింది. దాంతో ఈ సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. తెలుగులోనూ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్పగా రీమేక్ అవుతోంది.

 

 

ఇందులో ప్రియమణి వెంకటేష్ భార్యగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చైనాలో రీమేక్ అవుతుందంటూ వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాత ఎస్ థాను క్లారిటీ ఇచ్చారు. అసురన్ చిత్రం చైనాలో రీమేక్ అవుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదట. ఇలాంటి వార్త ఎలా సృష్టించబడిందో తమకి తెలియదని చెబుతున్నాడు. చైనా నుండి మమ్మల్ని ఎవరూ సంప్రదించలేరని, అందువల్ల ఆ వార్తని నమ్మవద్దని కోరాడు.

 

 

ఇకపోతే తెలుగులో రీమేక్ అవుతున్న ఈ చిత్రం కన్నడలోనూ రీమేక్ అవనుందట. అయితే కన్నడలో హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు. మొత్తానికి ధనుష్ నటించిన ఈ సూపర్ సక్సెస్ మూవీ రీమేక్ లు కూడా ఇంతలా సక్సెస్ అవుతాయో లేదో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: