మన ఇండియన్ సినిమాలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ నుంచి కూడా వాళ్ళు అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉంది. అందుకే చాలా మంది నందమూరి కుటుంబం విషయంలో ఏది అయినా మాట్లాడాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడే పరిస్థితి ఉంటుంది అనే విషయం అందరికి తెలుసు. సాధారణంగా సినిమాల్లోకి వచ్చిన వారి తో కొందరికి స్నేహం కూడా దాదాపుగా ఉండదు. అవసర౦ ఉంది అనుకుంటే మినహా వాళ్ళు పెద్దగా మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేయరు అని అంటారు. 

 

ఇక మన తెలుగు కి హిందీకి చాలా దూరం ఉంది. ఇక్కడ ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది అని అక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు గాని లేకపోతే అసలు మన తెలుగు ని వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకునే ప్రయత్నం కూడా చేయరు అనేది వాస్తవం. ఇక కొన్ని కొన్ని విషయాలను ప్రత్యేకంగా చెప్పుకుంటే... మన తెలుగులో ఉన్న నందమూరి కుటుంబానికి హింది లో ఉన్న కపూర్ ఫ్యామిలీ కి మంచి సంబంధాలు ఉన్నాయి అని అంటారు జనాలు. అవును చాలా మంది దీని గురించి చాలా సందర్భాల్లో చెప్పే వారు కూడా. ముఖ్యంగా ఎన్టీఆర్ ని కపూర్ ఫ్యామిలీ బాగా అభిమానించింది అని అంటూ ఉంటారు. 

 

రాజ్ కపూర్ నుంచి మొన్న మరణించిన రిషీ కపూర్ వరకు కూడా బాలకృష్ణ తో సన్నిహితంగా ఉండే వారు అని హైదరాబాద్ వస్తే బాలయ్య ఇంటికే వాళ్ళు వెళ్తూ ఉంటారు అని అంటారు. చాలా మంది ఈ విషయంలో ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసారట. వారికి వీరికి వ్యాపారాలు ఉండి ఉంటాయి అంటూ కొందరు కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి. ఏది ఎలా ఉన్నా వాళ్ళ స్నేహం అలాగే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: