నందమూరి బాలకృష్ణ కెరియర్ ఎప్పుడు సూపర్ హిట్లతో నడవలేదు.. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ఆడాయి. అయితే ఆరేళ్ళు వరుస ప్లాపులతో సతమతమవుతున్న బాలకృష్ణకు బోయపాటి రూపంలో లక్ కలిసి వచ్చింది. 2004లో లక్ష్మి నరసింహా సినిమాతో హిట్టు కొట్టిన బాలయ్య బాబు ఆ తర్వాత ఆరేళ్లలో 7 సినిమాలు చేశాడు. కానీ అందులో ఏ ఒక్కటి హిట్టు టార్గెట్ రీచ్ అవలేదు. 2010లో వచ్చిన సింహ సినిమాతో బాలకృష్ణ మళ్ళీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. 

 

బోయపాటి శ్రీను డైరక్షన్ లో బాలకృష్ణ మూవీ అనగానే అప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. అప్పటికే భద్రతో సూపర్ హిట్ అందుకుని వెంకటేష్ తో తులసి సినిమా తీసిన బోయపాటి బాలకృష్ణతో సింహా చేశాడు. ఆ సినిమా సాంగ్స్ కూడా సినిమాకు స్పెషల్  ఎట్రాక్షన్ గా మారాయి. ప్రేక్షకుల్లో బాలకృష్ణకు ఉన్న ఫాలోయింగ్ ను వాడుకుంటూ.. ఆయనకు మాత్రమే సూటయ్యే డైలాగ్స్ తో దుమ్ముదులిపేశాడు బోయపాటి శ్రీను. ఆ సినిమాతో బాలయ్య బాబు మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. 

 

ఇక బోయపాటి శ్రీనుతో మళ్ళీ లెజెండ్ సినిమా చేశాడు బాలకృష్ణ. ఆ సినిమా కూడా పర్వాలేదు అనిపించుకుంది. లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ వస్తుంది. బాలకృష్ణతో సినిమా తీస్తే అది బోయపాటి శ్రీను మాత్రమే తీయాలి అన్న రేంజ్ లో వీరి కాంబో సెట్ అయ్యింది. ఈ హ్యాట్రిక్ మూవీ కూడా హిట్ అయితే బిబి కాంబినేషన్ కు బాక్సాఫీస్ షేక్ ఆడాల్సిందే అన్న సెంటిమెంట్ ఏర్పడుతుంది. నందమూరి ఫ్యాన్స్ అయితే BB-3 పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.               

మరింత సమాచారం తెలుసుకోండి: