బాలకృష్ణ నటించిన మొదటి మూడు సినిమాలను కేవలం తన తండ్రి ప్రేమతో చూశారు కానీ మంగమ్మగారి మనవడు చిత్రాన్ని తెలుగు సినీ ప్రేక్షకులంతా చూసి బాలయ్య కు ప్రత్యేకంగా అభిమానులు అయ్యారు. కోడి రామకృష్ణ మంగమ్మగారి మనవడు కథ రాసుకుని ఎవరినీ కథానాయకుడిగా ఎంపిక చేయాలని ఆలోచిస్తున్న సమయంలో నిర్మాత గోపాల్ రెడ్డి బాలకృష్ణ అయితే చాలా బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. వెంటనే కోడి రామకృష్ణ ఎన్టీ రామారావు ని కలసి కథ చెప్పగా... బాగుంది బ్రదర్. మా వాడికి బాగా సూట్ అవుతుంది అని చెప్పారు. దాంతో కోడి రామకృష్ణ బాలయ్య బాబుకు సినిమా కథను వినిపించగా అతను ఓకే చెప్పేశాడు. 

IHG
నాయనమ్మ గా భానుమతిని, కథానాయకిగా సుహాసిని ని, హీరోగా బాలకృష్ణ ని కోడి రామకృష్ణ ఎంపిక చేసి షూటింగ్ మొదలుపెట్టారు. అయితే షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకి సినిమాలో బాలయ్య బాబు కృష్ణుని పాత్ర, రాముడి పాత్ర చేయాల్సి ఉందని చెప్పగా... బాలకృష్ణ షూటింగ్ లంచ్ బ్రేక్ సమయంలో బ్యూటీ పార్లర్ కి వెళ్లి తన శరీరంపై ఉన్న జుట్టు తీయించేసుకున్నాడు. మళ్లీ సెట్స్ వద్దకు రాగా... కోడి రామకృష్ణ ఎక్కడికి పోయారు అని బాలయ్యని ప్రశ్నించగా... కృష్ణుడు రాముడికి ఒంటిపై చుట్టూ ఉండదు అందుకే బ్యూటీ పార్లర్కి వెళ్లి జుట్టు చేయించుకుని వచ్చాను అని చెప్పి అతన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన అతడికి ఈ సినిమా పట్ల ఎంత డెడికేషన్ ఉందో చెప్పకనే చెబుతుంది. ఆరోజు ఎన్టీ రామారావు షూటింగ్ ప్రదేశానికి వచ్చి బాలకృష్ణకు పార్టీ పెట్టి స్వయంగా మేకప్ వేసి రాముడి లా కనిపించేలా తయారు చేశారు. మీరు కూడా అలాంటి పాత్రను చేస్తున్నారు. మీకు మా వారసత్వం వస్తుంది, గొప్ప వారు అవుతారు అని తండ్రి కొడుకు వీపు పై సుతిమెత్తగా చరిచి కి చెప్పారు. 

IHG's Three Conditions To Balakrishna
చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెప్టెంబర్ 3, 1994 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాగా మంగమ్మగారి మనవడు నిలిచింది. బాలకృష్ణ సినీ కెరీర్లో కూడా ఇదొక మైలురాయిగా నిలిచింది. బాలయ్య సినీ జీవితంలో 100 రోజులు ఆడిన మొట్టమొదటి సినిమాగా మంగమ్మగారి మనవడు చరిత్రకెక్కింది. ఆంధ్ర రాష్ట్రంలో వంద రోజులు కర్ణాటకలో కూడా 100 రోజులు ఆడిన ఏకైక సినిమాగా అప్పట్లో చరిత్రను తిరగరాసింది. హైదరాబాద్ నగరంలో 332 రోజులు, గుంటూరు జిల్లాలో 500 రోజులు, విశాఖలో ఏకంగా వెయ్యి రోజుల పాటు మంగమ్మగారి మనవడు సినిమా ఆడి రికార్డులు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: