టాలీవుడ్ లో కొంత కొంత మంది నటులు తమకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కింది స్థాయిలో ఉండే వాళ్ళను ఏ మాత్రం కూడా పట్టించుకునే అవకాశం ఉండదు అనే ఆరోపణలు మనం ఎప్పుడు ఏదోక సందర్భంలో వింటూనే ఉంటాం. ఏ విధంగా అయినా సరే వాళ్ళు కచ్చితంగా అహం చూపించే పరిస్థితి ఏదోక సందర్భంలో ఉంటుంది అని అంటారు. కాని టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ విషయంలో అలాంటి విమర్శ ఎప్పుడు కూడా రాలేదు. ఎవరు ఏది అయినా సరే ఆయన మాత్రం తనను ప్రేమించిన వాళ్ళను కచ్చితంగా ప్రేమిస్తారు అని అంటారు జనాలు. 

 

టాలీవుడ్ లో ఏదైనా నటుడు అది చిన్న అయినా పెద్ద అయినా సరే ఏదైనా కార్యక్రమానికి పిలిచినా అది వ్యక్తిగత కార్యక్రమం అయినా మరో కార్యక్రమం అయినా సరే కచ్చితంగా బాలకృష్ణ వెళ్తూ ఉంటారు అని అంటారు. ఆయనకు ఏ ఇబ్బంది ఉన్నా సరే కచ్చితంగా ఆ కార్యక్రమానికి ఆయన హాజరు అవుతూ ఉంటారు అని చెప్తారు. ఇదే విషయాన్ని ప్రముఖ యాంకర్ ఉదయ భాను ఒక వేదిక మీద చెప్పారు. ఆమె తన పిల్లల పుట్టిన రోజుని ఘనం గా చేసుకోవాలి అని భావించారు అని సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలను ఆమె ఆహ్వానించింది అని... 

 

చాలా మంది కనీసం ఫోన్ కి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి లో ఉండే వారు అని గాని ఆమె బాలకృష్ణ కు మెసేజ్ పెట్టారు అని ఆ తర్వాత ఆ మెసేజ్ చూసిన బాలకృష్ణ తిరిగి ఆమెకు ఫోన్ చేసి మరీ వచ్చి దాదాపు గంటకు పైగా ఉండి అందరితో ఫోటోలు దిగి వెళ్ళారు అని ఆమె చెప్పుకున్నారు. అలా ఆమె ఒక్కరే కాదు చాలా మంది కార్యక్రమాలకు బాలయ్య వెళ్తూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి: