సాధారణంగా వారసత్వం అనగానే అబ్బాయిల గురించే ఆలోచిస్తుంటారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మనదేశంలో వారసత్వంగా వచ్చే వారిలో ఎక్కువ భాగం అబ్బాయిలే ఉంటారు. మరీ ముఖ్యంగా సినిమాల్లో హీరోల కొడుకులే హీరోలుగా మారుతుంటారు. హీరోల కూతుర్లు హీరోయిన్లుగా మారిన సందర్భాలు తక్కువ. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొడుకు కూతురు అనే తేడా లేకుండా సినిమాల్లోకి వారసత్వం ఎంట్రీ ఇచ్చేస్తోంది.

 


అయితే ఎంత వారసత్వం ఉన్నా కృషి లేకపోతే కొన్ని రోజులకే మళ్ళీ తెరమరుగై పోవాల్సిందే. అలా కనుమరుగై పోయిన వారు చాలా మంది ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి హీరో కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో శ్రుతి హాసన్ కూడా ఒకరు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురైన శృతి హాసన్ తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన శ్రుతి స్టార్ గా ఎదిగింది.

 

అయితే గత కొన్ని రోజులుగా సినిమాలకి దూరమైన శృతి మళ్ళీ తెర మీద కనిపించనుంది. రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులని పలకరించడానికి సిద్ధమైంది. ఆ మధ్య తన లవర్ తో బ్రేకప్ అయ్యాక కొద్దిగా మానసికంగా డిస్టర్బ్ అయిన శృతి, ప్రస్తుతం వాటన్నింటినీ వదిలేసి తన కాన్ సన్ట్రేషన్ పూర్తిగా సినిమాల మీదే పెట్టింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఆక్టివ్ గా ఉంటుంది.

 

అయితే సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోవర్లు విపరీతంగా పెరుగుతున్నారు. ఇన్స్టా గ్రామ్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 14 మిలియన్లు దాటింది. దాంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.  ఈ విషయమై ఉబ్బితబ్బిబ్బ్బవుతున్న శృతి దీనిపై ఓ వీడియోని రిలీజ్ చేసి తన ఆనందాన్ని నెటిజన్స్ తో పంచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: