నందమూరి బాలకృష్ణ తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో విషయాలను ఎన్నో పరాజయాలను ఎదుర్కొన్నప్పటికి ఏనాడూ గొప్పల కి పోవడం గాని, కృంగిపోవడం గానీ చేయలేదు. వరుసబెట్టి ఎన్నో సినిమాలు హిట్ అయిన ప్పటికీ తాను మాత్రం ఎంతో వినయంగా మెలిగేవాడు. సినీ పరిశ్రమలో ఇలాంటి మనస్తత్వం ఉన్న ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు. గతంలో తాను తమ సినిమాల్లో వేసిన వేషాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రెండు సినిమాలు అతడి గొప్ప నటనా చాతుర్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాయి. అవేంటంటే ఆదిత్య 369, భైరవ దీపం సినిమాలు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 

 


1991వ సంవత్సరంలో సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 సినిమాలో నందమూరి బాలకృష్ణ, మాస్టర్ తరుణ్, సుత్తివేలు, మోహిని సిల్క్ స్మిత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అదే బాలకృష్ణ ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలు చేసి అంతవరకు తెలుగులో ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు చూడని సినిమా కథలు అద్భుతంగా నటించి అందరి చేత వావ్ అనిపించాడు. ఈ సినిమా లో శిక్షణ దేవరాయలు పాత్రలో తండ్రికి తగ్గ కొడుకు గా ఒదిగిపోయాడు. వాస్తవానికి ఈ సినిమాలో దేవరాయల పాత్ర ఉందని బాలకృష్ణ ను ఎంపిక చేశాడు దర్శకుడు సింగీతం శ్రీనివాస్. ఈ చిత్రం షూటింగ్ 110 రోజులు జరగగా... కోటి 60 లక్షల బడ్జెట్ తో పూర్తయింది. టైం మిషన్ ద్వారా భూత కాలం భవిష్యత్తు కాలం కి వెళ్లేలా తెరపై చూపించడం ప్రేక్షకులకు బాగా త్రిల్లింగ్ గా అనిపించింది. 1992 వ సంవత్సరంలో బి.గోపాల్ దర్శకత్వంలో రౌడీ ఇన్స్పెక్టర్ తెరకెక్కి బాలకృష్ణ కెరీర్లో మరో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 

 


ఏప్రిల్ 14, 1994వ సంవత్సరంలో సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ ద్వీపం చిత్రంలో నందమూరి బాలకృష్ణ రోజా హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో విభిన్న పాత్రలలో బాలయ్య నటించిన తీరు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. సినీ విమర్శకులు సైతం బాలకృష్ణ ఎటువంటి పాత్రలోనైనా చేయగల గొప్ప నటుడు అని కథనాల మీద కథనాలు ఎన్నో ప్రచురించారు. ఇందులో వికారమైన గూని పాత్రలో, విజయ్ రాకుమారుని పాత్రలో అద్భుతంగా నటించి చిరంజీవి వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు గట్టి కాంపిటేషన్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: