నందమూరి బాలకృష్ణ 60వ పుట్టిన రోజు సందర్భం గా సోషల్ మీడియా మోత మోగిపోతోంది. ఈ సందర్భం గా బాలయ్య జీవితం లో సాధించిన విజయాలను, విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఈ సందర్భం గా కొన్ని వివాదాస్పద అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. అలాంటి ఓ అరుదైన విషయం శ్రీదేవి తో బాలయ్య సినిమా చేయకపోవటం.
బాలయ్య హీరోగా సూపర్ ఫాం లో ఉన్న సమయంలో హీరోయిన్ గా శ్రీదేవి టాప్ రేంజ్ లో ఉంది. బాలయ్య సమకాలీకు లైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే బాలయ్య తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు శ్రీదేవి. అయితే బాలయ్య తో శ్రీదేవి సినిమా చేయకపోవటం పై రకరకాల వార్తలు ప్రచారం లో ఉన్నాయి.
అయితే ఇందుకు నందమూరి అభిమానులు చెప్పే కారణం ఏంటంటే. శ్రీదేవి, సీనియర్ ఎన్టీఆర్ కు జంటగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల లో నటించింది. వీరిద్దరిదీ అప్పట్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్. తండ్రితో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి తో నటించటం ఇష్టం లేకే బాలయ్య ఆమె కాంబినేషన్ కు నో చెప్పాడన్న టాక్ ఉంది.
అయితే ఈ కాంబినేషన్ పై మరో ప్రచారం కూడా ఉంది. ఎన్టీఆర్ సరసన నటిస్తున్న సమయంలో బాలయ్య, శ్రీదేవి ల మధ్య చిన్న వివాదం జరిగిందని.. ఆ వివాదం కారణం గానే బాలయ్య తో సినిమా చేసేందుకు శ్రీదేవి ఓకే చెప్పలేదని ప్రచారం కూడా ఉంది. అయితే ఈ విషయంలో ఏది నిజం అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.