ఇరవై సంవత్సరాలకు పైగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జీవితంలో స్క్రిప్టులను తానే స్వయంగా రాసుకుని జానీ అనే ఒక సినిమాని తెరకెక్కించాడు కూడా. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందే లేకపోయినా... అతనికి మాత్రం చాలా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. తదనంతరం దేశి అనే ఒక దేశభక్తి సినిమా స్క్రిప్ట్ రాసుకుని తెరకెక్కించాలని చూశాడు కానీ ఏవో కారణాల వలన ఆ సినిమా తెరకెక్కలేదు. 

IHG
కేవలం దర్శకుడి గా, రచయితగా నటుడిగా మాత్రమే కాదు ఫైట్ మాస్టర్ గా, సింగర్ గా పవన్ కళ్యాణ్ అవతారం ఎత్తి తాను మల్టీ టాలెంట్ వ్యక్తిగా సినీ పరిశ్రమలో పేరు పొందాడు. అతనిలో ఎన్ని టాలెంటు ఉన్నప్పటికీ ఎక్కువగా దర్శకుడు అవ్వాలనే ఆసక్తి అతనిలో ఎప్పుడూ ఉండేది. సినీ రంగ ప్రవేశం చేసేప్పుడు కూడా దర్శకుడిగానే ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ తన అన్నయ్య చిరంజీవి భార్య అయిన సురేఖ బాబు నువ్వు నటుడిగా చేస్తేనే బాగుంటుంది' అని సూచించారు. దాంతో సొంత వదిన మాట కాదనలేక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు మోపి గొప్ప నటుడిగా ఎదిగాడు. 

IHG

అతని అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు కాగా... కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన అనంతరం పవన్ కళ్యాణ్ గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి అతడిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పిలవగా ఆ పేరే ఇప్పుడు అతనికి శాశ్వతంగా మిగిలిపోయింది. బిరుదుకి తగ్గట్టు గా పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలలో పవర్ ఫుల్ గా నటించి అక్షర మంది సినీ అభిమానులకు దేవుడయ్యాడు. అతనికి బడా సెలబ్రిటీలలో కూడా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాల్లోనే తన జీవితాన్ని అర్పిస్తుంది బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: