నందమూరి నట వారసుడు బాలకృష్ణ ఈరోజు తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు రాజకీయ  సినీ ప్రముఖులు. దీంతో సోషల్ మీడియా మొత్తం నందమూరి బాలకృష్ణ బర్త్ డే విషెస్ తో నిండి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా ఈ రోజుకి నందమూరి బాలకృష్ణ తన అరవై ఏట అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. 60 వ వడిలోకి  అడుగుపెడుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా బాలకృష్ణ అదే ఎనర్జీ తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు . నాలుగు దశాబ్దాలకు పైగా బాలకృష్ణ చిత్ర పరిశ్రమలో తన హవా నడిపిస్తూ ఎంతగానో గుర్తింపు సంపాదించారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించిన బాలకృష్ణ... ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. 

 


 అయితే తాతమ్మకల అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ... మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించాడు అని చెప్పాలి. అయితే తాతమ్మకల సినిమాలో నటించిన సమయంలో నందమూరి బాలకృష్ణ కేవలం 9వ తరగతి మాత్రమే చదువుతున్నాడు. అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టిన బాలకృష్ణ... ఇప్పటికీ కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ ఏ హీరోకి లేదు అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. 

 


 ఇకపోతే నందమూరి బాలకృష్ణ వివాహం విషయంలో కొన్ని ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఒకసారి బాలకృష్ణ వివాహం విషయంలో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం. బాలయ్య వసుంధర ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కాకినాడకు వసుంధర ను  పెళ్లిచూపులు చూడడానికి ముందుగా నందమూరి తారక రామారావు ఫ్యామిలీ వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ ఏం చెప్పకుండానే ఇంటికి వచ్చారు. ఇదే సందర్భంలో వసుంధర బాలకృష్ణ  ఫ్యామిలీ లో కొంతమందికి నచ్చలేదట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మరో సారి ఆలోచించి బాలకృష్ణకు వసుంధర అయితేనే బాగా సెట్ అవుతుంది అని అనుకొని వసుంధర తో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: