యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ 60వ పుట్టిన రోజు వేడుక‌లు బుధ‌వారం ఎక్క‌డిక‌క్క‌డ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా బాల‌య్య అభిమానులు బాల‌య్య బ‌ర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఏపీ మాజీ సీఎం, బాల‌య్య‌కు బావ‌, వియ్యంకుడు అయిన చంద్ర‌బాబు నటన అయినా ప్రజాసేవ అయినా చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణ గారు అంటూ  కొనియాడారు. ఆయన కోట్లాది మంది అభిమానులను తన నిబద్ధతతోనే సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

IHG

ఇక బాల‌య్య సోద‌రి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి తన ట్విట్టర్ ఖాతాలో బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిద్దరూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సోదరా .. జన్మదిన శుభాకాంక్షలు అంటూ పురంధరేశ్వరి బాలకృష్ణను విష్ చేశారు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో 
నాలోని అభిమానిని తట్టిలేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే అని కితాబు ఇవ్వ‌డంతో పాటు బాబాయ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు.

IHG

ఇక బాల‌య్య త‌న క‌ల‌ల రూపం అయిన బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డకు పంచెక‌ట్టుతో వెళ్లిన బాల‌య్య ముందుగా త‌న త‌ల్లిదండ్రుల విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఆ త‌ర్వాత అక్క‌డ డాక్ట‌ర్లు, క్యాన్స‌ర్ బాధితులు.. కొంద‌రు చిన్నారుల స‌మ‌క్షంలో కేక్ క‌ట్ చేసి.. అక్క‌డ వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఈ దృశ్యాలు మ‌న‌సును హ‌త్తుకునేలా ఉండ‌డంతో పాటు బాల‌య్య మ‌న‌సు ఎంత వెన్నో చాటి చెప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: