టాలీవుడ్ లో ఎంతో మంది నట వారసులుగా వచ్చారు.. కానీ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్న వారు అతి కొద్ది మందే ఉన్నారు.  అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల (1974) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి నటించిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం లాంటి సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు సంపాదించారు.. అయితే ఈ సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించాడు. ఇక హీరోగా మారిన తర్వాత గ్రామీణ వాతావరణంలో ఉన్న సినిమాల్లో ఎక్కువగా నటించారు.  

IHG

బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు, అనసూయమ్మగారి అల్లుడు, అల్లరి కృష్ణయ్య, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వా గోపాలుడు, భానుమతి గారి మొగుడు ఇలా ఎన్నో సినిమాల్లో పల్లెటూరి కుర్రాడిగా బాగా ఆకట్టుకున్నారు.  ఆ తర్వాత బాలయ్య ట్రెండ్ మార్చారు.. నరసింహ నాయుడు, సీమ సింహం, చెన్నకేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మ నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్ ఇలా ఫ్యాక్షన్ తరహా సినిమాల్లో నటించారు.  ఒకదశలో చెప్పాలంటే బాలయ్యకు ఫ్యాక్షన్ సినిమాలు బాగా కలిసి వచ్చాయి.

IHG

యన డైలాగ్ డెలివరీ, యాక్షన్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాయి.  ఇక ఫ్యాక్షన్ తరహా సినిమాలు అంటూ బాలకృష్ణ మాత్రమే అన్న రేంజ్ కి వచ్చింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సింహా, లెజెండ్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించింది. ఆయన వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత పలు సినిమాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు.  ఈ నేపథ్యంలో మరోసారి బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ తరహా సినిమాలో నటిస్తున్నారు.  నిన్న రిలీజ్ అయిన టీజర్ లో మరోసారి బాలయ్య తన విశ్వరూపాన్ని చూపించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: