టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు రెండు రోజుల క్రితమే సీఎం కేసీఆర్ తో మరియు కొంతమంది ప్రభుత్వ ప్రతినిధులతో సినిమా మరియు టీవీ సీరియల్స్ షూటింగ్ లకు సంబంధించి అనుమతి పొందుతున్న విషయం అందరికి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు ఇటీవల లాక్ డౌన్ ఆంక్షలు, సడలింపులు ఈ విషయంలో వెసులుబాటు కల్పించడంతో సరికొత్త నిబంధనలతో కండిషన్ లతో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు చూసి చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు ఇలా అయితే సినిమా షూటింగ్ లు జరగడం కష్టమే అని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను ఒకసారి గమనిస్తే వాటి వివరాలు ఇలా ఉన్నాయి… 

 

IHG

> సగం పూర్తయిన సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్ లకు మాత్రమే ముందుగా అనుమతి.

> షూటింగ్ లలో పాల్గొనే ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరి.

> షూటింగ్ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి, అలాగే భౌతికదూరం కచ్చితంగా పాటించాలి.

> షూటింగ్ ఏరియాలో పాన్, సిగరెట్లు నిషేధం.

> షూటింగ్ స్పాట్ లో తప్పనిసరిగా డాక్టర్ ఉండాల్సిందే.

> ప్రతి రోజూ ఉదయాన్నే షూటింగ్ ప్రారంభించే ముందు భౌతికదూరం గురించి చిత్ర యూనిట్ కు వివరించాలి.

 

IHG

> ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత నిర్మాతలదే.

> షూటింగ్ స్పాట్ లో 40 మందికి మాత్రమే ఉండాలి.

> కార్లను శానిటైజ్ చేసిన తర్వాతే ఆర్టిస్టుల దగ్గరికి పంపాలి.

> ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ ప్రాంతాల్లో తప్పనిసరిగా శానిటైజర్, హ్యాండె వాష్ అందుబాటులో ఉంచాలి.

> కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్ లు చేయకూడదు.

> వీలైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ లు జరపకూడదు.

> మేకప్ వేసుకున్నా ఆర్టిస్టులు ఫేస్ షీల్డ్ ను ఉపయోగించాలి.

> ఇండోర్ షూటింగ్ లకే ప్రాధాన్యత ఇవ్వాలి.

> మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రస్సర్లు పీపీఈ కిట్లు ధరించాలి

 

మరింత సమాచారం తెలుసుకోండి: