తెలుగు సినీ రంగంలో కామెడీ చిత్రాల దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్న దర్శకుడు ఇవీవీ సత్యనారయణ. దాదాపు టాలీవుడ్‌ స్టార్ హీరోలందరితో సినిమాలను తెరకెక్కించిన ఈవీవీ కామెడీ, ఫ్యామిలీ డ్రామాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచాడు. ఎంతో మంది హాస్యనటులకు జీవితాన్ని ఇచ్చిన ఆయన చిన్న వయసులోనే తుది శ్వాస విడిచారు.

 

ఆయన వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన అల్లరి నరేష్‌, ఆర్యన్‌ రాజేష్‌లలో నరేష్ హీరోగా మంచి ఫేం సాధించాడు. కామెడీ చిత్రాలతో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా ఎదిగిన అల్లరి నరేష్, ఈవీవీ బతికి ఉన్నంత కాలం వరుస సినిమాలతో అలరించాడు. అయితే ఈవీవీ మరణం తరువాత నరేష్ జీవితం కూడా గాడి తప్పింది. దీంతో ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు నరేష్.

 

ఈ రోజు తండ్రి ఈవీవీ జయంతి సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్‌ ఫోటోను షేర్ చేశాడు నరేష్‌. తాను చిన్నప్పుడు నాన్నతో కలిసి దిగిన ఫోటో పెయింటిగ్‌ను, ప్రస్తుతం తాను తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించిన నరేష్‌ ఎమోషనల్‌గా కామెంట్ చేశాడు. `హ్యాపీ బర్త్‌ డే నాన్న గారు... మీలోని కొంత భాగాన్ని తిరిగి నా జీవితంలోకి పంపినందుకు కృతజ్ఞతలు` అంటూ కామెంట్ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy Birthday Nanna garu... Thank you for sending me a part of you back into my life to keep your aura alive. #EVV

A post shared by allari Naresh (@allari_naresh) on

మరింత సమాచారం తెలుసుకోండి: