మనలో చాలామంది సినీరంగానికి చెందిన వ్యక్తులపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సినీ రంగంలో ఉండే వివాదాలు, విబేధాలు, ఆరోపణల కారణంగా ప్రజల్లో వారిపై ఇలాంటి అభిప్రాయం ఏర్పడింది. కానీ వాస్తవంగా సినిమా రంగానికి చెందిన వారు ఇతర రంగాలతో పోలిస్తే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు, నెలలు కష్టపడి వందలాది మంది పని చేసి ఒక సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. 
 
మనం ఆ సినిమా రెండు గంటల్లో హిట్ లేదా ఫ్లాప్ అని తేల్చేస్తూ ఉంటాం. సినీ రంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు నిర్మిస్తున్న అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వాళ్ల గురించి పాజిటివ్ గా మాట్లాడే వారు పాజిటివ్ గా... నెగిటివ్ గా మాట్లాడేవారు నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ వల్ల అల్లు అరవింద్ గారిపై నెగిటివ్ ప్రచారం జరిగింది. అయితే తాజాగా అల్లు అరవింద్ మానవత్వాన్ని చాటుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. 
 
కొబ్బరిమట్ట సినిమా సాయిరాజేష్ అల్లు అరవింద్ యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఆయన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఆడియో " మై డాడ్ మోస్ట్ మిస్ అండర్ స్టూడ్ పర్సన్ ఇన్ ద వరల్డ్" అని అన్నారని..... ఆ మోస్ట్ మిస్ అండర్ స్టూడ్ పర్సన్ గురించి తాను చెప్పాలనుకున్నానని పేర్కొన్నారు. సరిగ్గా 15 రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేని స్థితిలో ఉన్న మా పాపకు డాక్టర్లు సర్జరీ అవసరమని చెప్పారని... ఆ మాట విన్న వెంటనే కాళ్లూ చేతులు ఆడలేదని అన్నారు. 
 
ఆ తరువాత బన్నీవాస్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పానని... రాత్రి 9 గంటల సమయంలో బన్నీ వాస్ సూచనల మేరకు ఫోన్ చేశానని అన్నారు. అల్లు అరవింద్ హాస్పిటల్ డాక్టర్ తో, మేనేజ్ మెంట్ తో మాట్లాడి అన్ని విషయాలను అవగాహన చేసుకున్నారని... అల్లు అరవింద్ సర్జరీకి డబ్బు గురించి ఏం కంగారు పడవద్దని.... తాను వెనుక ఉన్నారని చెప్పారు. ఆ డబ్బు తాను తీసుకొలేదని.... కానీ ఆయన చాలాసార్లు మాట్లాడి ధైర్యం చెప్పారని... డాక్టర్లతో కూడా మాట్లాడారని ఆయన గొప్పదనాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: