రాజకీయాల మీద ఇప్పుడు సినిమాలు చేస్తే వాటికి మంచి డిమాండ్ ఉంటుంది ఈ మధ్య. వాటిని కొనడానికి కూడా ముందుకు వస్తున్నారు జనాలు. ప్రస్తుతం మన తెలుగులో రాజకీయం మీద సినిమాలు చేయడానికి మహేష్ బాబు రానా జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు సిద్దంగా ఉంటున్నారు. అయితే సినిమాల షూటింగ్ విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని అంటున్నారు. అవి ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఎప్పుడు పాత నటులనే వాటికి వాడాల్సి వస్తుంది అని సమర్ధవంతమైన నటులు రాజకీయాలకు తగిన విధంగా సినిమాల్లో దొరకడం లేదట. 

 

ఇప్పుడు టాలీవుడ్ లో కోటా శ్రీనివాసరావు లేరు తనికెళ్ళ భరణి వంటి వారే ఉన్నారు. అదే విధంగా జయప్రకాష్ రెడ్డి ముఖేష్ ఋషీ వంటి వారు కూడా పెద్దగా కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఎటు నుంచి ఎటు చూసినా సరే రావు రమేష్ మినహా ఎవరూ కూడా కనపడటం లేదు అనే చెప్పాలి. శుభలేఖ సుధాకర్ వంటి వారిని తీసుకోవడం లేదు. వాళ్ళు ఏదో ఒక సినిమాలో కనపడుతున్నారు. అందుకే ఇప్పుడు సినిమాల్ల రాజకీయ నాయకుల కొరత ఎక్కువగా ఉందని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఆ సినిమాలను అందుకే జనాలు అంత ఆసక్తిగా తీసుకుని చేయడం లేదు అని సమాచారం. 

 

ఇక రానా వంటి హీరో కూడా ఆ విధమైన సినిమాల ను చెయ్యాలని చూసినా సరే ఆ తరహా నటులు దొరకక ఆయన వెనకడుగు వేసాడు అని సమాచారం. ఇక బాలకృష్ణ సినిమాల్లో రాజకీయాలు ఉన్నా సరే ఎక్కువగా ఆయన పాత్ర మినహా మరొకటి హైలెట్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు. మరి భవిష్యత్తులో ఎవరు సినిమాల్లో రాజకీయ నాయకులు గా మారతారు అనేది చూడాలి అంటున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: