భవిష్యత్తులో జనాలు సినిమాలను చూసే అవకాశం లేదా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. గతంలో మాదిరిగా ఇప్పుడు జనాలు సినిమాలను చూస్ అవకాశాలు దాదాపుగా అలేవు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అగ్ర హీరోల సినిమాలు అయినా సరే  ఓటీటీ లో చూసే రోజులు వస్తున్నాయి అని జనాలకు ఇప్పుడు బయటకు వెళ్ళాలి అంటే భయంగా ఉంది అని ఎక్కడ ప్రాణాల మీదకు వస్తుందో అనే ఆందోళన  జనాలకు ఎక్కువగా ఉంది అని అందుకే ఇప్పుడు హీరోలు అయినా నిర్మాతలు అయినా సరే ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టడం మంచిది అని హెచ్చరిస్తున్నారు. 

 

గతంలో సినిమా అంటే జనాలకు ఒక పిచ్చి ఉండేది అని ఇక ఇప్పుడు ఉన్న ఆర్ధిక ఇబ్బందుల దెబ్బకు జనాలకు భవిష్యత్తు మీద భయం ఉంది అని జనాలు ఎప్పుడో ఒకసారి సినిమా గాని ప్రతీ వీకెండ్ కి హాల్ కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి ఉండదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చిన్న చిన్న హీరోల సినిమాల విషయంలో కూడా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుని అవసర౦ అనుకుంటేనే బడ్జెట్ పెట్టాలి అనే సలహాలను ఇస్తున్నట్టు సమాచారం. ఇక ఓటీటీ మీద దృష్టి పెట్టే విధంగా సినిమాలను ఉంచితే మంచిది అనే సలహాలు అయితే ఇప్పటికే టాలీవుడ్ లో వినపడుతున్నాయి. 

 

మహేష్ బాబు లాంటి హీరో కూడా ఇప్పుడు ఓటీటీ మీద ఎక్కువగా దృష్టి పెట్టే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. ఎన్టీఆర్ కూడా భవిష్యత్తులో ఓటీటీ మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. చిరంజీవి రామ్ చరణ్ దీని మీద ఇప్పటికే చర్చలు కూడా జరిపి ఆ విధంగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. నానీ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: