దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి సినీ ప్రముఖులు పేదల కోసం.. సినీ కార్మికుల కోసం ఎంతో అండగా నిలుస్తున్నారు.  బాలీవుడ్ నటుడు సోనూ సూద్ అయితే వలస కార్మికుల గురించి నిరంతరం కష్టపడుతూ.. వారిని తమ గమ్యస్థానాలకు చేరుకునేలా బస్సు, ఫ్లైట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.   ఇలా సోనూ సూద్ చేస్తున్న సేవలకు భారత దేశం మొత్తం సాహెూ అంటున్నారు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ సైతం తన ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నారు.  కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌ సమయంలో సినీ కార్మికులకు సీసీసీ వెన్నుదన్నుగా నిలిచింది. 

 

ముంబై నగరంలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను తరలించేందుకు 10 బస్సులను ఏర్పాట్లు చేశారు. ఏబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ యాదవ్, మాహిం దర్గా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ సుహైల్ ఖండ్వానీలు ముంబై నగరం నుంచి 43 మంది పిల్లలు, 225 మంది వలస కార్మికుల 10 బస్సుల్లో తరలించారు.వలస కార్మికులను వారి స్వస్థలమైన యూపీకి పంపించేందుకు అమితాబ్ ముందుకు రావటంతో తాము ఈ ఏర్పాట్లు చేశామని హాజీఅలీ, మహిం దర్గా నిర్వాహకులు సబీర్ సయ్యద్ తెలిపారు. తమ దర్గాతో బిగ్ బికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  

 

ఇప్ప‌టికే ముంబై నుండి 10 బ‌స్సులు ఏర్పాటు చేసి ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ప‌లు ప్రాంతాల‌కి వ‌ల‌స కూలీల‌ని త‌ర‌లించారు అమితాబ్. తాజాగా అమితాబ్ బచ్చ‌న్ వ‌ల‌స కార్మికుల‌ని స్వ‌స్థ‌లాల‌కి పంపేందుకు మూడు ప్ర‌త్యేక ఫ్లైట్స్ ని ఏర్పాటు చేశారు.ఈ  ఫ్లైట్స్ ద్వారా 500 మంది కూలీల‌ని వార‌ణాసికి పంపారు. ముందుగా రైళ్ళ‌ల్లో వారిని పంపాలని భావించిన‌ప్ప‌టికీ, అది కుద‌ర‌క‌పోవ‌డంతో ప్ర‌త్యేక ఫ్లైట్స్ ద్వారా పంపారు.  అయితే ఈ విషయాన్ని ఆయన ఎక్కడా వెల్లడించలేదు.. కానీ మీడియాకు మాత్రం తెలిసిపోయింది.. మనం చేసే పని కనిపించాలి.. మనం కనిపించకున్నా పరవాలేదు అన్న మంచి మనసు అమితాబ్ కి ఉందని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: