కోలీవుడ్ లో ఒక క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు అక్కడ హాట్ న్యూస్ గా మారింది. యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి తన టాలెంట్ తో హీరోగా మారిన శివ కార్తికేయన్ తనలా టాలెంట్ ఉండి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఛాన్స్ ఇస్తాడు. ఇప్పటికే శివ కార్తికేయన్ నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ మరో క్రేజీ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. శివ కార్తికేయన్ నిర్మాణంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ హీరోగా ఒక సినిమా రాబోతుందట. ఇప్పటికే విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్నాడు. 

 

ఈమధ్యనే మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కూడా హీరోగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక వారి బాటలో అనిరుద్ కూడా హీరో కావాలని ఆశపడుతున్నాడని తెలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా అతి తక్కువ కాలంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనిరుద్ స్టార్స్ కు సైతం సూపర్ హిట్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హీరోగా మారుతున్న అనిరుద్ మ్యూజిక్ కొనసాగిస్తాడా లేక హీరోగానే సెటిల్ అవుతాడా అన్నది తెలియాల్సి ఉంది. 

 

ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా తెర వెనుక ఉండాల్సిందే.. అందుకే హీరోగా మారి తన అసలు టాలెంట్ చూపించాలని అనుకుంటున్నాడు అనిరుద్. ఇంతకీ శివ కార్తికేయన్, అనిరుద్ కాంబోలో వచ్చే సినిమాకు దర్శకుడు ఎవరు. ఈ సినిమా ఏ జానర్ లో రాబోతుంది అన్నది తెలియాల్సి ఉంది. కొద్దిగా బక్కపలచగా ఉంటాడనే కానీ మ్యూజిక్ తో మెప్పించే అనిరుద్ హీరోగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. తెలుగులో కూడా అనిరుద్ కు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు.. అతను హీరోగా చేస్తే ఇక్కడ కూడా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కేవలం మ్యూజిక్ తో మాత్రమే కాదు.. నటుడి గా కూడా అనిరుద్ మంచి సత్తా చాటుకోబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: