తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుని  ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్  మెగా వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్ తేజ్.. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకొన్నాడు. ఇక ఆ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేసిన ఎన్నో జాగ్రతలు  తీసుకుంటూ  మంచి విజయాలు అందుకుని ప్రత్యేక  గుర్తింపు సంపాదించాడు. మొదటినుంచి లవర్ బాయ్ గా  గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్  ఒక్కసారిగా మాస్ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. వరుణ్ తేజ్ కి మాస్ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా గద్దలకొండ గణేష్. 

 

 హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా లో వరుణ్ తేజ్ నటన  గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను అలరించిన వరుణ్ తేజ్  గద్దలకొండ గణేష్ సినిమా లో ఒక్కసారిగా మాస్ లుక్ తో  అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అది కూడా మధ్య  వయస్కుడి పాత్రలో నటించిన వరుణ్ తేజ్  ఫుల్ మాస్ లుక్ తో ఇరగదీశాడు అనే చెప్పాలి. తెలంగాణ యాసలో అదరగొట్టిన వరుణ్ తేజ్ ఒక్కసారిగా మాస్ ప్రేక్షకులందరికీ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. ఒక్క సినిమాతో ఎంతగానో మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు వరుణ్ తేజ్. 

 


 ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో గా మారిపోయాడు. తెలంగాణ యాసలో డిఫెరెంట్  ఆటిట్యూడ్ తో  పాత్రకి తగ్గట్టుగా వరుణ్ తేజ్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులకు ఇప్పటికీ ఫేవరేట్ గా నిలుస్తాయి . ఈ  సినిమాలో మాస్ యాక్షన్ తో కూడా ఇరగదీశాడు వరుణ్ తేజ్ . మొదటి నుంచి లవర్ బాయ్  తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ వచ్చిన వరుణ్ తేజ్... ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులు ఎవరూ ఊహించలేని క్రేజ్ సంపాదించుకున్న తనలోని నటుణ్ణి కూడా ప్రూవ్  చేసుకుని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం ఈ హీరో  సినిమా వస్తుందంటే మాస్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: